Balakrishna: బాలయ్యను ఈ రేంజ్‌లో తీర్చిదిద్దిన చిన్నమ్మకు హ్యాట్సాప్.. ఎవరామె..!?

Balakrishna Look 1

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఎలాంటి పాత్రలకైనా.. డిఫరెంట్ స్టయిల్‌లో నటించడానికైనా రెడీగా ఉంటాడు. ‘అన్‌స్టాపబుల్-2’ (Unstoppable 2) షో.. ‘వీరసింహారెడ్డి’ మూవీలో బాలయ్య లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అయితే ఈ రేంజ్‌లో బాలయ్య లుక్‌ను తీర్చిదిద్దినది ఎవరబ్బా అని నెట్టింట్లో జనాలు తెగ వెతికేస్తున్నారట. మరోవైపు బాలయ్యకు అత్యంత సన్నిహితులు కూడా బాబోయ్ లుక్ మామూలుగా లేదుగా ఎవరు చేశారని ఎంక్వయిరీ మొదలెట్టారట. ఈ క్రమంలో ఇందుకు కర్త, కర్మ, క్రియ మొత్తం చిన్నమ్మేనని తెలియవచ్చింది. ఇంతకీ ఎవరా చిన్నమ్మా.. ఏంటా కథ.. ఓ లుక్కేద్దాం రండి.

Balakrishna Daughter Tejasw

ఆ చిన్నమ్మ మరెవరో కాదండోయ్.. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని (Balakrishna daughter Tejaswini). ఆమె కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేస్తోంది. ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమాతో పాటు.. అన్‌స్టాపబుల్-2’ షో కు కూడా కాస్టూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తోంది. అంతేకాదు.. బాలయ్య విగ్గు ఇదివరకటిలాగా కాకుండా ఇప్పుడు నేచురల్ లుక్‌లో కనిపించడానికి కూడా తేజశ్వినీనే కారణమట. దగ్గరుండి కాస్టూమ్స్, హెయిర్ స్టయిల్ అన్నీ చూసుకుంటోందట. వాస్తవానికి ‘వీరసింహారెడ్డి’ లుక్ అదిరిపోయింది.. మునుపెన్నుడూ లేని విధంగా బాలయ్య నయా లుక్‌లో వచ్చేస్తున్నాడు.

Balakrishna Look 2

మొత్తానికి చూస్తే.. బాలయ్యను ఈ రేంజ్‌లో తీర్చిదిద్దిన తేజశ్విని (Tejaswini) స్టయిలిష్ వర్క్ సూపర్బ్ అని అభిమానులు, అనుచరులు మెచ్చుకుంటున్నారు. అటు ఇండస్ట్రీ నుంచి కూడా చిన్నమ్మకు ప్రశంసలు అందుతున్నాయి. ఏదైతేనేం.. నాన్నను ఇలా చూపించడంలో చిన్నకుమార్తె చాలానే కష్టపడుతోందన్న మాట. సో మున్ముందు కూడా ఇలాంటి మరిన్ని నయా లుక్స్‌‌తో బాలయ్యను చూపించాలని అభిమానులు కాంక్షిస్తున్నారు.

Google News