NTR Koratala Siva Movie: ఎన్టీఆర్-కొరటాల మూవీ ఫస్ట్ సీన్ ఇదేనా.. అదిరిపోయిందిగా..!

NTR Koratala Siva film

జూనియర్ ఎన్టీఆర్ – టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (NTR Koratala Siva Movie) కాంబోలో మూవీ తెరకెక్కబోతోంది. మంచి కమర్షియల్ సినిమాలకు మెసేజ్ అద్దే కొరటాల.. ఈసారి బుడ్డోడితో అదిరిపోయే కాన్సెప్ట్‌తో సినిమా చేస్తున్నాడు. న్యూయర్ సందర్భంగా ఎన్టీఆర్-30 (NTR30) మూవీ నుంచి క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్.  అదిరిపోయే పోస్టర్‌ రిలీజ్ చేసిన టీమ్.. ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చింది. ఇందులో ఎన్టీఆర్ (Jr NTR) ముఖం చూపించలేదు కానీ.. రెండు చేతుల్లో కత్తులు పట్టుకున్నట్లు ఉన్న పోస్టర్‌‌తోనే సరిపెట్టేశాడు డైరెక్టర్. వచ్చే ఏడాది ఏప్రిల్‌-5th, 2024 న సినిమా రీలీజ్ చేస్తామని కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారిక ప్రకటన చేసేసింది.

NTR Koratala Siva film

తాజాగా.. ఇందుకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఫస్ట్ షెడ్యూల్‌లో ఏమేం షూట్ చేస్తారు..? ఇంట్రోసీన్ ఎలా ఉండబోతోంది..? అనేదానిపై ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎవరైనా లీక్ చేశారో లేకుంటే రూమర్స్ వస్తున్నాయో తెలియట్లేదు కానీ.. ఇదిగో ఇదే ఫస్ట్ యాక్షన్ సీన్ అంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సముద్ర నేపథ్యంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో మొదట షూట్ చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడట. ఈ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్.. ఫుల్ రఫ్‌, మాస్ లుక్‌లో కనిపిస్తాడని తెలియవచ్చింది.

NTR Koratala Siva film

పాన్ ఇండియా రేంజ్‌లో సినిమా వస్తుండగా.. ఇప్పటికే పలు పాత్రలకు నటీనటులను సెలక్ట్ చేసింది టీమ్. విలన్‌గా సంజయ్‌దత్‌ (Sanjay Dutt)ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు హీరోయిన్‌గా జాన్వీకపూర్ (Janhvi Kapoor) దాదాపు ఖరారైందని కూడా టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్-కొరటాల (NTR – Koratala Siva) కాంబో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఇదే కాంబోలో మూవీ వస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయ్. తాజాగా వస్తున్న రూమర్స్‌పై మేకర్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి.

Google News