Pawan Kalyan – Balakrishna: పవన్-బాలయ్య ఎపిసోడ్‌ రిలీజ్‌కు డేట్ ఫిక్స్..!

Pawan Kalyan Aha episode

‘ఆహా’.. ‘అన్‌స్టాపబుల్ సీజన్-2’  నాన్‌స్టాప్ అనిపించేలా పరుగులు తీస్తోంది. ఒకప్పుడు ‘ఆహా’ గురించి తెలియని జనాలు ఇప్పుడు ఆ యాప్ ఎక్కడుందిరా బాబోయ్ అని వెతుక్కుని మరీ అకౌంట్ తీసుకుంటున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రారంభమైన ఈ సీజన్ విజయవంతంగా రాణిస్తోంది. ఆ తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ రాకతో ‘ఆహా’ యాప్ క్రాష్ అయ్యిందంటే ఏ రేంజ్‌లో జనాలు చూశారో అర్థం చేసుకోవచ్చు.

అలా రోజురోజుకూ పెరుగుతున్న ‘ఆహా’ ఆదరణ రెట్టింపు చేసేలా పెద్ద పెద్ద సెలబ్రిటీలను పట్టుకొస్తున్నారు నిర్వాహకులు. ఈ మధ్య జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వచ్చారు. ఆయన రాకతో ‘ఆహా’ ఆఫీస్ ప్రాంగణమంతా పండుగ వాతావరణంగా మారిపోయింది. పవన్ ఎంట్రీతో దద్దరిల్లిపోయిన షో.. ఇక ఎపిసోడ్ యాప్‌ల్ రిలీజ్ అయితే ఎలా ఉంటుందో మాటల్లో చెప్పక్కర్లేదు. అందుకే.. కరెక్ట్‌గా సంక్రాంతి రోజున (జనవరి-13న) రిలీజ్ చేయాలని.. అప్పుడైతే అన్నీ కలిసొస్తాయని యాజమాన్యం యోచిస్తోందని టాక్. అంటే.. సంక్రాంతికి పవన్ (Pawan Kalyan), బాలయ్య (Balakrishna) ఫ్యాన్స్.. జనసేన (Janasena), టీడీపీ కార్యకర్తలకు స్పెషల్ కానుక వస్తోందన్న మాట.

Pawan Kalyan Balakrishna Aha Episode

బాలయ్య (Balakrishna) ఎలాంటి ప్రశ్నలు అడిగారు..? పవన్ సమాధానం ఎలా వచ్చింది..? అనేదానిపై ఇప్పుడు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. మెగా, నందమూరి ఫ్యామిలీకి పెద్దగా పడదు.. పైగా రాజకీయంగా కూడా రెండు కుటుంబాలు వేర్వేరు.. అయితే ఈ ఇద్దరూ ఒకే వేదికపైకి రావడమనేది మామూలు విషయం కాదు. అలాంటి ఈ ఇద్దరి మధ్య జరిగిన ఇంటర్వ్యూ అంటే.. ఇక ఎలా ఉంటుందో చూడండి. పైగా పవన్ గురించి వైసీపీ అస్తమాను చేస్తున్న విమర్శలకు కూడా ఈ వేదికపై సింగిల్ లైన్‌లో సమాధానాలు వచ్చాయనే టాక్ కూడా నడుస్తోంది.

ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ చూసినప్పుడు పెళ్లి, వ్యక్తిగత విషయాల కోసం ఎంతగానో వేచి చూసిన జనం.. ఒక్కసారిగా ఆహా మీద పడటంతో దెబ్బకు క్రాష్ అయ్యింది. ఇక పవన్ (Pawan Kalyan) ఇంటర్వ్యూ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఇప్పట్నుంచే యాప్, సర్వర్ వ్యవహారాలన్నీ సెట్ చేస్తున్నారట నిర్వాహకులు. ఎపిసోడ్ ఎలా ఉంటుందో.. ఎలాంటి ప్రశ్నలు బాలయ్య అడిగారో..? సమాధానాలు ఎలా వచ్చాయనే విషయాలు తెలియాలంటే సంక్రాంతి దాకా వేచి చూడాల్సిందే అన్న మాట.

Google News