Tamannaah Bhatia: భాయ్‌ఫ్రెండ్‌‌తో గోవాలో దొరికిపోయిన తమన్నా

Tamannaah Bhatia with Vijay Varma

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ తమన్నా భాటియా (Tamannaah Bhatia).. ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తోంది. తెలుగులో కాస్త సినిమాలు తక్కువయ్యే సరికి బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టిన మిల్క్‌బ్యూటీ టైమ్ దొరికినప్పుడల్లా విజయ్ వర్మ (Vijay Varma)తో తెగ ఎంజాయ్ చేస్తోంది. పిక్నిక్‌లు, పార్టీలు అంటూ తిరుగుతూ మీడియా కంటపడుతున్నారు. ఇప్పటి వరకూ చాలా క్లోజ్‌గా మూవ్ అవ్వడంతో ఇద్దరూ ఫ్రెండ్స్ అని మాత్రమే అనుకున్నప్పటికీ న్యూయర్‌తో ఈ ఇద్దరూ లవ్ బర్డ్స్ అని తేలిపోయింది. ఇందుకు ఇదిగో ఈ హగ్స్, కిస్సింగ్‌ సాక్ష్యం.

గోవాలో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పార్టీలో విజయ్ (Vijay Varma) వైట్ షర్ట్‌లో అదిరిపోయే లుక్‌లో కనిపించగా.. తమన్నా(Tamannaah Bhatia) మరీ హాట్‌గా అవుట్‌ఫిట్స్ అందంతో దర్శనమిచ్చింది. అందరితో పాటు పార్టీ చేసుకున్నారు ఓకే.. ఆ తర్వాత హగ్, కిస్సులతో రెచ్చిపోయిందీ జంట. దీంతో మిల్క్‌బ్యూటీ.. విజయ్‌తో లవ్‌లో ఉందని కన్ఫామ్ అయిపోయింది. ఇన్ని రోజులుగా లవ్ వ్యవహారం రెడ్‌హ్యాండెడ్‌గా తెలిసిపోయింది. వాస్తవానికి ఈ జంట.. ‘లస్ట్ స్టోరీస్‌-2’ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఇందులో నటించేటప్పుడే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరు మరింత దగ్గయ్యారు. ఆ మధ్య ఈ జంట డేటింగ్‌లో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇద్దరూ ఎయిర్‌పోర్టు, హోటల్స్‌, పార్టీల్లో కనిపించినప్పటికీ లవ్‌ విషయాన్ని మాత్రం ఎవరూ కన్ఫామ్ చేయలేదు.

Advertisement
Tamannaah Bhatia with Vijay Varma

2023 న్యూఇయర్ రోజున.. గోవా వేదికగా మిల్క్‌బ్యూటీ ప్రేమ వ్యవహారం బయటికొచ్చింది. సో.. ఈ వీడియోలు, ఫొటోలను బట్టి డేటింగ్ వ్యవహారం కన్ఫామ్ అయ్యింది. ప్రస్తుతం వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నా తమన్నా గానీ.. విజయ్ (Vijay Varma) గానీ స్పందించలేదు. లవ్‌ను కన్ఫామ్ చేస్తారా లేకుంటే.. ఎవరేం రాసుకుంటే తమకేంటి అని మిన్నకుండిపోతారా అనేది వేచి చూడాలి. అయితే నెట్టింట్లో మాత్రం కామెంట్స్, మీమ్స్ తెగ పేలిపోతున్నాయ్. ‘నీ అందం.. చందం ఏంటి.. పోయి పోయి ఇలాంటి వ్యక్తితోనే డేటింగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

విజయ్.. బాలీవుడ్ నటుల్లో మంచి టాలెంట్ ఉన్న నటుడు. ‘పింక్’, ‘ఎంసీఏ’, ‘గల్లీభాయ్’, ‘భాగీ’, ‘డార్లింగ్స్’ సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ‘మిర్జాపూర్-3’, ‘డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్‌’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. తమన్నా (Tamannaah Bhatia).. మెగాస్టార్ చిరు హీరోగా వస్తున్న ‘భోలా శంకర్’ నటిస్తోంది. ఏప్రిల్-14న సినిమా రిలీజ్ కానుంది. దీంతో పాటు ‘కిట్టి’ అనే మలయాళ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది.