Anjali: అంజలి నటనకు చెర్రీ ఫిదా.. చిరు సరసన లక్కీ ఛాన్స్!

Anjali in Chiranjeevi film

స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ వస్తే.. అదెలాంటి పాత్ర అయినా మారుమాట చెప్పకుండా నటీమణులు ఓకే చెప్పేస్తుంటారు. అలాంటిది.. ఇక మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కి జోడీగా నటించాలనే ఛాన్స్ వస్తే ఒక్కసారి ఊహించుకోండి. తెలుగు బ్యూటీ అంజలి (Anjali)ని మాత్రం వెతుక్కుంటూ మరి అవకాశం వచ్చిందట. దీంతో అమ్మడి కల నెరవేరింది.. అంజలి నక్క తోక తొక్కిందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయ్. అంతేకాదండోయ్.. తన డ్రీమ్ అక్షరాలా నిజమవ్వబోతోందని ఫ్రెండ్స్‌కు చెప్పుకుని తెగ మురిసిపోతోందట తెలుగు బ్యూటీ.

మెగా ఫ్యామిలీలో ఇప్పుడు చెర్రీ (Ram Charan) మూవీలో అంజలీ నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ నటనకు ఫిదా అయిన చరణ్.. చిరు సినిమా ‘భోలా శంకర్’ (Bhola Shankar)లో కీలక పాత్రకు రెఫర్ చేశాడట. నెగిటివ్ రోల్‌లో ఈ బ్యూటీ మెరవనుందట. ఈమె పాత్రే సినిమాకు ప్రాణమట. అవన్నీ కాదు.. పాత్ర ఏదైతేనేం.. చిరు సరసన నటించే ఛాన్స్ వచ్చిందిగా అదే చాలంటూ ఆనందంలో మునిగితేలుతోందట. చిరు-తమన్నా (Chiranjeevi – Tamannah) మధ్య తగాధాలు పెట్టే క్యారెక్టర్ అని సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.

Anjali in Chiranjeevi film

వాస్తవానికి తెలుగమ్మాయి అంజలీ.. (Anjali) నటనలో స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు. తెలుగమ్మాయి కదా అనే ఒకే ఒక్క కారణంతో ఛాన్సులు రావట్లేదు కానీ.. ఈమె నటించిన సినిమాలన్నీ మంచి హిట్ కొట్టాయ్ కూడా. అంతేకాదు ఈ మధ్య వెబ్ సిరీస్‌లో కూడా నటించి తన రేంజ్‌ ఏంటో చూపించింది. మొత్తానికి చూస్తే.. మెగా కంపౌండ్‌లో అమ్మడు.. అటు కొడుకుతో.. ఇటు తండ్రితో నటించబోతోందన్న మాట. అంజలీకి ఇంతకంటే అదృష్టం మరొకటి ఉండదేమో మరి. Any Way All the Best .. తెలుగమ్మాయ్.

Google News