Sreeleela: శ్రీలీల.. సాయిపల్లవికి గట్టి పోటీ ఇస్తోందిగా..!

Sreeleela Sai Pallavi

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా రాణిస్తూనే, డ్యాన్స్ కూడా ఇరగదీసే ముద్దుగుమ్మల్లో తమన్నా (Tamannah), సాయిపల్లవి (Sai Pallavi) ఇద్దరూ మొదటి స్థానంలో ఉన్నారు. ఇంకాస్త లోతుగా వెళితే కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఈ ముగ్గురిలో ఎవర్నయినా మేకర్స్ సెలక్ట్ చేసుకున్నారంటే.. అందం, అభినయం, యాక్టింగ్, డాన్స్‌ గురించి ఆలోచించక్కర్లేదు. ముఖ్యంగా సాయిపల్లవితో డ్యాన్స్ చేయడానికి హీరోలే ఒకింత భయపడుతుంటారు. అయితే ఈ మెడిసిన్ ముద్దుగుమ్మకు.. మరో మెడిసిన్ భామ పోటీ వస్తోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు.. అసలు కథేంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

Sreeleela

యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ పాప చేసింది రెండంటే రెండు సినిమాలే. అందులోనూ ‘పెళ్లి సందడి’ (Pellisandadi) సినిమా ప్లాప్.. తాజాగా నటించిన ‘ధమాకా’ (Dhamaka) మిక్స్‌డ్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ భామ అంద చందాలు, డ్యాన్స్ చూడటానికి మాత్రం జనాలు తెగ ఎగబడుతున్నారట. ఈ రెండు సినిమాల్లోనూ హీరోకు ధీటుగా.. ఈ భామ దుమ్ము లేపేసింది డ్యాన్స్. ఒక్కసారి స్టెప్ చూపిస్తే చాలు.. సింగిల్ టేక్‌లోనే లేపేస్తోందట. అటు అందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా నటించేస్తుండటంతో ఒకట్రెండు కాదు.. ఏకంగా ఏడు సినిమాల్లో ఆఫర్లు వచ్చేశాయ్.

Sreeleela in Dhamaka

ఇప్పటి వరకూ టాలీవుడ్ ఇండస్ట్రీలో సాయిపల్లివే (Sai Pallavi) టాప్ డ్యాన్సర్. ఇప్పుడు శ్రీలీల(Sreeleela).. సాయిపల్లవికి పోటీ వచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదండోయ్.. ఈ ఇద్దరి డ్యాన్స్‌లు నెట్టింట్లో చూడటానికి సాయిపల్లవి సాంగ్స్ పోల్చి చూస్తున్నారట. ‘వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే..’, ‘సారంగదరియా’.. ‘రౌడీ బేబీ’ సాంగ్‌లో సాయిపల్లవి డ్యాన్స్ ఇరగదీసింది. ఇటు శ్రీలీల నటించిన.. ‘మధురా నగరిలో..’, ‘జింతాక్’ సాంగ్స్ చూసిన ఫ్యాన్స్, సినీ ప్రియులు సాయికి గట్టిగానే పోటీ ఇస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. శ్రీలీల (Sreeleela) డ్యాన్స్‌ను మించి ఎక్స్‌ప్రెషన్స్ మాంచి కిక్కు ఇస్తున్నాయని చెబుతున్నారు.

వాస్తవానికి ఇలా డ్యాన్స్‌ చేసే అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు. సో.. మున్ముందు ఇటు టాప్ హీరోయిన్‌గా.. అటు టాప్ డ్యాన్సర్‌ రేంజ్‌కు వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. డ్యాన్స్ ఒక్క విషయంలోనే కాదు.. సాయిపల్లివికి.. శ్రీలీల (Sreeleela) చదువులో కూడా ఇద్దరూ మెడిసిన్ చదువుతున్నారు. ఏ ముద్దుగుమ్మ అయినా సరే రెండు సినిమాలతో లెక్క తేలిపోతుంది.. కానీ.. శ్రీలీల విషయంలో మాత్రం అవన్నీ రివర్స్ అయ్యాయ్. మరి ఈ భామ ఏ మేరకు టాలీవుడ్‌లో స్థానం దక్కించుకుంటుందో వేచి చూడాలి.

Google News