Kalyan Dhev: చిరు అల్లుడు ఏం చేయబోతున్నాడు.. మెగా ఫ్యాన్స్‌లో ఉత్కంఠ!

Kalyan Dhev

టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ (Sreeja) భర్త కల్యాణ్‌ దేవ్‌..(Kalyan Dhev) ఈ మధ్య చిత్ర విచిత్రాలుగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాడు. ఈ పోస్టుల వెనుక ఆంతర్యమేంటబ్బా అని మెగా ఫ్యాన్స్ తెగ సోదిస్తున్నారు. ఈ మధ్యనే ‘కాస్తా ఓపికగా ఉండండి.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది’ అంటూ సస్పెన్స్‌గా పోస్ట్ పెట్టగా మెగా ఫ్యామిలీ అసలేం జరుగుతోందనే క్వశ్చన్.. ఫ్యాన్స్‌లో మెదులుతోంది. అది మరువక ముందే.. న్యూ ఇయర్ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. మరో బాంబ్ పేలుస్తూ ఇన్‌స్టా పోస్ట్ చేశాడు.

ఇంతకీ పోస్ట్‌లో ఏముంది..?

‘2022 ఏడాదిలో నేను చాలా నేర్చుకున్నా. సహనంగా ఎలా ఉండాలి..? ఎదుగుదల అంటే ఏంటో తెలిసింది. అవకాశాలను అందుకోవడం, రిస్క్ చేయడం తెలుసుకున్నా. అంతకు మించి నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నా. ఇతరులను క్షమించడం.. నాతో నేను ఎక్కువగా గడపడం ఇలా ఎన్నో నేర్చుకున్నాను. నా ఈ ప్రయాణంలో ఉండి.. నన్ను నేను మార్చుకునేలా సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యావాదలు. మీ అందరి ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ప్రయత్నించడం.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దూ.. మీ అందరికీ ప్రేమ, ఆరోగ్యం, ఆనందం, సాహసం, విజయం, మీరు కోరుకునేది ప్రతిదీ ఉండాలని కోరుకుంటూ హ్యాపీ న్యూయర్’ అని ఫొటోతో శుభాకాంక్షలు తెలిపాడు కళ్యాణ్ దేవ్.

Kalyan Dhev Instagram Post

అయితే ఈ మధ్య కళ్యాణ్ (Kalyan Dhev) పెట్టిన ప్రతీ పోస్ట్.. నెట్టింట్లో హాట్ టాపిక్‌గానే నడుస్తోంది. చిరు అల్లుడికి ఏమైంది.. పర్సనల్ లైఫ్‌లో ఏమైనా గొడవలు జరిగాయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వరుస పోస్టులతో మెగా ఫ్యాన్స్‌లో రోజురోజుకూ ఉత్కంఠ పెరిగిపోతోంది. ప్రతీ పోస్టులో ఏదో ఒక పంచాయతీ పెడుతున్నాడేంటి అని ఒకింత కన్నెర్రజేస్తున్నారు. అసలు మనసులో ఏముందో ఒక్కసారి కక్కేయచ్చుగా.. ఎందుకీ డొంకతిరుగుడు పోస్టులంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

Kalyan Dhev and Sreeja

గతేడాదిలోనే శ్రీజ-దేవ్ (Kalyan Dhev, Sreeja) విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలకు అటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ.. ఇటు కళ్యాణ్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. సో.. ఈ మౌనానికి అంగీకారమనే అర్థం అని స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ మధ్య మెగా ఫ్యామిలీలో జరిగిన క్రిస్మస్, తాజాగా జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో కళ్యాణ్ కూడా కనిపించలేదు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఇక ఈ వరుస సోషల్ మీడియా పోస్టులకు అర్థం, ఆంతర్యమేంటో హీరోకే తెలియాలి మరి.

Google News