LB Sriram : కొత్త కుర్రాడు.. అదిరగొట్టాడుగా.. !

LB Sriram

ఎల్బీ శ్రీరామ్ (LB Sriram) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిందేమీ లేదు. ఎందుకంటే ఆయన చేసిన పాత్రలు ఇప్పటికీ.. ఎప్పటికీ జనాల్లో నిత్యం నానుతూనే ఉంటాయ్ గనుక. ఐదారేళ్లుగా సినిమాల్లో ఆయన నటించికపోయినప్పటికీ షార్ట్ ఫిల్మ్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ‘నాకు నచ్చనది ఏదైనా వదులుకుంటా.. నచ్చిన చోట సంతృప్తిగా ఉంటా’ అంటూ సమాజానికి మంచి మంచి మెసేజ్‌లు ఇస్తూ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు పెద్దాయన. ఇన్నాళ్లు హాస్య నటుడిగా చేసిన ఆయన.. ఇప్పుడు తనలో ఇంకా చాలా ఉన్నాయ్ అంటూ ఒక్కొక్కటి బయటికి తీస్తున్నాడు.

ఎల్బీ శ్రీరామ్.. (LB Sriram) కమెడియన్‌గా ఉన్న టైమ్‌లో సుమారు 50 మంది దాకా కమెడియన్స్ ఉన్నారు. అయినా సరే తన హాస్యం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఒక్క నటుడే కాదండోయ్.. సినీ, నాటక రచయిత, దర్శకుడు ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే హార్ట్ ఫిలిం మేకర్ అని చెప్పుకోవచ్చు. సమాజ హితం కోసం ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేస్తూ వస్తున్నాడు. ఇక అసలు విషయానికొస్తే.. కొత్త ఏడాది పెద్దాయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

LB Sriram

న్యూ ఇయర్ రోజున విష్ చేస్తూ.. ‘కొత్త సంవత్సరంలో కొత్తకొత్తగా ఏదైనా చేద్దాం.. నేను సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను.. కొత్త కుర్రాణ్ణి కనక.. కుర్రవేషాలేస్తున్నా!’ అని షార్ట్, గాగుల్స్‌తో ఉన్న స్టైలిష్ ఫోటో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌ చేసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. అవును.. మీరు కుర్రాళ్లేనండోయ్.. కాదన్నదెవరు..? అని కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఎల్బీ సార్.. కమాన్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేయండి.. !

Google News