Pooja Hegde: అయ్యో పూజా పాప.. 2023 అయినా కలిసి వచ్చేనా ?

Actress Pooja Hegde

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్దే (Pooja Hegde) అతి తక్కువ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ మురిపించలేకపోయినా.. ‘దువ్వాడ జగన్నాథం’ హిట్ కావడంతో ఇక అడ్డూ అదుపు లేకుండా ఇండస్ట్రీని దున్నేస్తుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లే వరుస సినిమాలతో ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల వైకుంఠపురంలో..’, ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ ఇలా వరుస సినిమాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. దెబ్బకు స్టార్ హీరోయిన్‌గా ప్రమోషన్ వచ్చేసింది. ఇలా అన్ని హిట్‌లు కావడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితే లేకుండా పోయింది.

Pooja Hegde In Radhe Shyam

ఇప్పటి వరకూ అన్నీ ఓకే కానీ.. 2022 మాత్రం పూజా పాప (Actress Pooja Hegde)కు అస్సలు కలిసిరాలేదు. భారీ అంచనాలతో వచ్చినప్పటికీ.. ‘రాధేశ్యాం’ (Radhe Shyam), ‘బీస్ట్’ (Beast), ‘ఆచార్య’ (Acharya) నిన్న మొన్న నటించిన బాలీవుడ్ మూవీ ‘సర్కస్’ ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా మినిమమ్ మూవీగా ఆడలేదు. మధ్యలో ఇంకా బాలీవుడ్ సినిమాల్లో నటించినా ఫలితం మాత్రం ప్లాప్. దీంతో ఒకప్పుడు పూజా పాపను ‘గోల్డెన్ లెగ్’ అన్న వాళ్లంతా.. బాబోయ్ ‘ఐరన్ లెగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్లాప్ అయిన కొన్ని సినిమాలకు కర్త, కర్మ, క్రియ మొత్తం ఈ పొడుగు కాళ్ల సుందరీనే అని కూడా కామెంట్స్ వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. అందుకే పూజా పని అయిపోయిందని తెలుగు, తమిళ్, బాలీవుడ్ ఇండస్ట్రీలు చెప్పుకుంటున్నాయట.

Pooja Hegde in Acharya

ఇలా 2022 ఏడాది మొత్తం మూడు, నాలుగు భాషల్లో నటించినా ఒక్కటంటే ఒక్కటీ హిట్ పడలేదు. ఆఖరికి ఈ ముద్దుగుమ్మ ఆడిపాడిన ఐటెం సాంగ్స్ కూడా అంతంత మాత్రమే అంటే ఇంతకంటే ఘోరం మరోటి ఉండదేమో. ఇక ఒకట్రెండు సినిమాల్లో ఇదే సీన్ రిపీట్ అయితే మాత్రం పాపను పూర్తిగా పక్కనెట్టినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఇప్పటికే మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చే మూవీకి పూజా (Pooja Hegde)ను సెలక్ట్ చేశారని టాక్ వచ్చింది. ఇక హిందీలో ‘కిసీకా భాయ్.. కిసీకా జాన్’ కు హీరోయిన్‌గా మేకర్స్ ఫిక్స్ చేసుకున్నారు కూడా. 2023 లో అయినా కాలం కలిసొచ్చి పాప.. హిట్‌ బాట పడుతుందో చూడాలి.. Any Way All The Best పూజా.

Google News