Custody Glimpse: చైతూ కమ్ బ్యాక్ పక్కా.. ‘కస్టడీ’ టీజర్ అదిరిపోయిందిగా..!

Naga Chaitanya Custory Teaser

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) – తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) కాంబోలో తెరకెక్కిస్తున్న సినిమా ‘కస్టడీ’(Custody). తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. చైతూకు ఇదే తొలి స్ట్రయిట్ తమిళ్ సినిమా. న్యూ ఇయర్ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. సినిమాకు సంబంధించి టీజర్‌ను (Custody Glimpse) రిలీజ్ చేసింది యూనిట్.

ఇప్పటికే ఒకట్రెండు మాస్ సినిమాలు చేసిన చైతూ.. (Naga Chaitanya) ఇందులో అంతకుమించి ఊరమాస్‌లా ఉన్నాడు.  యాక్షన్ మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నట్లు టీజర్‌ను బట్టి చూస్తే అర్థమవుతోంది. పల్లెటూరి మధ్యలో వెళుతున్న బొగ్గు రైలును ముందు చూపించడం.. రోడ్డు మీద వెళుతున్న పోలీసు కార్లు, ఆ తర్వాత జాతర సెటప్, ఆ వెంటనే బ్లాస్ట్… స్మోక్ ఎఫెక్ట్ మధ్యలో నుంచి యువసామ్రాట్ ఎంట్రీ, యాక్షన్ సీన్స్.. సింపుల్‌ నాలుగైదు గ్లింప్స్‌తో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో క్లియర్‌ కట్‌గా చూపించేశాడు డైరెక్టర్.

Naga Chaitanya Custody Glimpse

టీజర్ చూసిన అక్కినేని ఫ్యాన్స్ అదుర్స్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇదే కదా.. మన ఫ్యాన్స్‌కు కావాల్సిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఫ్యాన్స్ అయితే.. అప్పట్లో నాగ్‌ను ‘మాస్‌’లో ఇప్పుడు అంతకుమించి చైతూను ‘ఊరమాస్’గా చూడబోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘కస్టడీ’ చైతూకు కమ్ బ్యాక్ అవ్వాలని చాలా మంది నెటిజన్లు, డై హార్డ్ ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు. వాస్తవానికి సినిమా టీజర్‌ను బట్టి చూస్తే అది పక్కా నిజం అవుతుందని తెలిసిపోతోంది.

ఇంకాస్త వివరంగా చెప్పాలంటే.. ‘కస్టడీ’లో చైతూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. పోస్టర్‌ను బట్టి చూస్తే.. పోలీసులు చుట్టూ ఉండగా హీరో మధ్యలో ఉన్నాడు. అయితే తోటి అధికారులంతా కదలకుండా బంధిచారని తెలుస్తోంది. అయితే.. ఎందుకు బంధించారు.. దీనికి వెనుక ఉన్న కథేంటి అనేది సస్పెన్స్‌తో అదిరిపోయేలా ఉంటుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మే- 22న తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ కానుంది.

Google News