#NTR30 Movie: ఎన్టీఆర్ ఫ్యాన్స్ న్యూ ఇయర్ ట్రీట్.. ఈ ట్విస్ట్ ఏంటో..?

Treat to NTR Fans

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)- టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబోలో మూవీ (NTR30 Movie) తెరకెక్కబోతోంది. మంచి కమర్షియల్ సినిమాలకు మెసేజ్ అద్దే కొరటాల.. ఈసారి అదిరిపోయే కాన్సెప్ట్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు. దీంతో అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అటు జూనియర్ ఫ్యాన్స్.. ఇటు కొరటాల వీరాభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే ఇన్నాళ్లు వేచిన ఫ్యాన్స్‌కు కొత్త ఏడాదిలో సరికొత్త ట్రీట్ వచ్చేసింది ఎన్టీఆర్ ఆర్ట్స్.

న్యూయర్ సందర్భంగా ఎన్టీఆర్-30 (NTR30) మూవీ నుంచి క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్.  సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్‌ రిలీజ్ చేసింది యూనిట్. ఇందులో ఎన్టీఆర్ (NTR) ముఖం చూపించలేదు కానీ.. రెండు చేతుల్లో కత్తులు పట్టుకున్నట్లు ఉన్న పోస్టర్‌ బయటికొచ్చింది. అంతేకాదండోయ్.. వచ్చే ఏడాది ఏప్రిల్‌-5th, 2024 న సినిమా రీలీజ్ చేస్తామని కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ (NTR Arts) అధికారిక ప్రకటన చేసేసింది. సో.. దీన్ని బట్టి చూస్తే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ (NTR Fans)కు డబుల్ ట్రీబుల్ వచ్చేసినట్లే. ఇందులో ఒకటి పోస్టర్, రెండోది.. రిలీజ్ డేట్.

Treat to NTR Fans

ఈ పోస్టర్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అదిరిపోలా మావోడి పోస్టర్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కొందరు ఫ్యాన్స్.. ‘అరవింద సమేత’ ను మించి సినిమా ఉండబోతోందని పోస్టర్‌ను చూసి చెప్పేస్తున్నారు. అన్నీ సరే.. రిలీజ్ డేట్ మరీ వచ్చే ఏడాది ఏంటి సామీ అంటే.. వచ్చే ఏడాది అంతా షూటింగ్స్‌తోనే సరిపోతుందా అని కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఈ రేంజ్‌లో ట్విస్ట్ ఇచ్చారేంటి బాస్ అని కొరటాల, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అసంతృప్తి వెళ్లగక్కుతూ మీమ్స్ పేలుస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. హీరోయిన్, ఇతర పాత్రలకు సంబంధించి ఇప్పటికే నటీనటులు ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయ్ కానీ.. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Google News