అక్టోబర్‌లో పెళ్లి.. తల్లి కాబోతున్న తెలుగు హీరోయిన్..

Heroine 010123

సినీ నటి పూర్ణ.. (Actress Poorna) ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. టాలీవుడ్‌లో కాస్తో.. కూస్తో సినిమాల్లో నటించి ఫర్లేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత పూర్తిగా బుల్లితెర షోలు, చిన్నపాటి హీరోల సరసన నటిస్తూ రాణిస్తోంది. ఈ భామ పెళ్లిపై ఎప్పుడు వార్తలు వచ్చినా అదో సెన్సేషనే అయ్యేవి. ఆ తర్వాత ఆ వార్తలన్నీ నిజం చేస్తూ అక్టోబర్-24న దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్‌ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరిది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. అయితే పెళ్లి చేసుకున్న రెండు నెలల వ్యవధిలోనే తాను ప్రెగ్నెంట్ అంటూ అభిమానులు, సినీ ప్రియులకు షాకింగ్ వార్త చెప్పింది పూర్ణ (Poorna).

Actress Poorna

తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది పూర్ణ. తల్లి కాబోతున్న ఈ భామకు అభిమానులు, నెటిజన్లు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాబోయ్ ఇదెలా సాధ్యం.. అని కొందరు చిత్ర విచిత్రాలుగా క్వశ్చన్ చేసే నెటిజన్లు కూడా ఉన్నారు. వాస్తవానికి పెళ్లికి ముందు నుంచే పూర్ణ (Poorna) ఎక్కడా మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. అంతేకాదు.. ఆఖరికి ఢీ షోలో కూడా కనిపించలేదు. ఆ టైమ్‌లో పూర్ణ ప్రెగ్నెంట్ అని వార్తలు వచ్చినా ఖండించలేదు. చివరికి ఆ వార్తలే నిజమయ్యాయ్.

Actress Poorna

అయితే.. పూర్ణ-షనీద్ ప్రేమ మొదలుకుని పెళ్లి, ప్రెగ్నెన్సీ వరకూ అన్ని విషయాల్లోనే ఈ జంట చాలా గోప్యంగా ఉంచుతూ వచ్చింది. పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత వీడియోను యూట్యూబ్‌లో పెడితే కానీ అభిమానులకు తెలియలేదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ విషయం కూడా అంతే. దీంతో ఈ జంటపై రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. సో.. Any Way.. https://sootiga.in తరఫున కంగ్రాట్స్ పూర్ణ. 

Google News