Naresh – Pavitra Lokesh: లేటు వయస్సులో ఘాటు ప్రేమ.. త్వరలో పెళ్లి.. వైరలవుతున్న వీడియో

Naresh, Pavitra Lokesh

సీనియర్ నటుడు నరేష్-పవిత్ర లోకేష్.. (Naresh – Pavitra Lokesh) గత కొన్ని నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ ప్రైవేట్‌గా రూమ్‌లో ఉండగా.. నరేష్ (Naresh) భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం.. ఆ తర్వాత ఇద్దరూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం.. తనను కించపరుస్తున్నారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై పవిత్ర (Pavitra) పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం ఇలా ఒకటా రెండా.. నానా రచ్చే చేసింది ఈ జంట. సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) తుదిశ్వాస విడిచినప్పుడు కూడా ఈ ముదురు ప్రేమపక్షులు జంటగా కనిపించి చర్చనీయాంశమయ్యాయి. అయితే.. ఇకపై అవన్నీ ఏముండవ్.. ఏం చేసినా లైసెన్స్‌తోనే చేయబోతున్నారు.

సహజీవనం మొదలుకుని.. ఈ ఇద్దరు ఎక్కడ కనిపించినా అదో పెద్ద న్యూస్‌గా నిలిచేది. ఇక వీటన్నింటికీ ఈ ఏడాదితో ఫుల్‌స్టాప్ పెట్టి.. వచ్చే ఏడాది మూడు ముళ్లతో ఒక్కటి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా డిసెంబర్-31న అధికారికంగా ప్రకటించేసిందీ జంట. ‘వెల్‌ కమ్‌ టూ అవర్‌ వరల్డ్’ అంటూ ఓ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు నరేష్‌. క్యాండిల్ లైట్ల మధ్యలో కేక్‌ పెట్టి కట్‌ చేసుకుని ఒకరి ఒకరు కేక్‌ తినిపించుకున్నారు. అంతటితో ఆగలేదండోయ్.. ఏకంగా ఇద్దరూ లిప్‌ కిస్‌ పెట్టుకొని నానా రచ్చ చేశారు. ఇదేం విడ్డూరం బాబోయ్.. అంటూ సోషల్ మీడియాలో చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. లేటు వయస్సులో ఇదేం ఘాటు ప్రేమ బాబోయ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Naresh, Pavitra Lokesh

నరేష్ (VK Naresh) వయస్సు 62, పవిత్ర లోకేష్ (Pavitra Lokesh) వయస్సు 43.. ఈ ఇద్దరికి ఎంత వయస్సు తేడానో చూశారుగా.. అయినా సరే మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లుగా ఈ జంట పక్షులు చెలరేగిపోతున్నాయ్. ఇవన్నీ ఒక ఎత్తయితే గూగుల్‌లో సైతం.. నరేష్ అని సెర్చ్ చేయగానే పవిత్ర లోకేష్ పేరు కూడా ఆటోమాటిక్‌గా చూపిస్తోంది. కొత్తేడాది పెళ్లి చేసుకోబోతున్న నరేష్-పవిత్ర జంటకు ఆల్‌ ది బెస్ట్.

Google News