Prabhas: 2023లో ప్రభాస్‌కు అన్నీ సమస్యలే.. బాంబ్ పేల్చిన జ్యోతిష్యుడు..!

Prabhas In 2023

సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి (Venu swamy) గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఇప్పటి వరకూ ఈయన చెప్పిన చాలా మంది జాతకాలు అక్షరాలా నిజమయ్యాయి కూడా. సమంత-నాగచైతన్య (Samantha – Naga Chaitanay) విడాకులు, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna), చెర్రీ-ఉప్సీ (Ram Charan – Upasana) సంతానం గురించి ఇవన్నీ ఐదారేళ్ల కిందటే చెప్పినప్పటికీ.. నిదానంగా ఒక్కొక్కటి చెప్పినట్లే జరుగుతూ వస్తున్నాయ్. అయితే అవన్నీ యాదృచ్చికంగా జరిగాయా.. లేదా అనేది పైనున్న పెరుమాళ్లకే తెలియాలి. ఈ ఘటనలు అన్నీ మరిచిపోక ముందే.. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ (Prabhas) ఆరోగ్యం గురించి సంచలన కామెంట్స్ చేశారు. ఓ ప్రముఖ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2023లో ప్రభాస్ పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది చెప్పారు.

ఇంతకీ వేణుస్వామి (Venu Swamy) ఏం చెప్పారు..?

‘ ప్రభాస్ (Prabhas) జీవితంలో చాలా చాలా ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ పరంగా సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్. శని, గురు మారుతున్నాడు. ప్రభాస్‌ది వృశ్చిక రాశి. ఓవైపు అర్ధాష్టక శని.. మరోవైపు అష్టమ గురువు ఉన్నారు. దీంతో చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. జాతకరీత్యా ప్రభాస్‌కు చాలా సమస్యలు మాత్రం రాబోతున్నాయి. ఆయన జాతకాలు నమ్మరు.. ఇది మేజర్ ప్రాబ్లమ్. అందుకే జాతకాల నమ్మకుండా తీసిన జాతకాల సినిమా పోయింది. దేవుడు, జాతకాలపైన నమ్మకం ఉండాలి. ఏదైనా పనిచేసేటప్పుడు కచ్చితంగా నమ్మి చేయాలి.. అప్పుడే అది వర్కవుట్ అవుతుంది’ అని వేణుస్వామి చెప్పుకొచ్చారు.

https://www.facebook.com/toptelugutvchannel/videos/687400326415424

చాలా వరస్ట్..!

ఇప్పటికైనా ప్రభాస్ (Rebel Star Prabhas) జాతకాలు నమ్మితీరాలి. రాజులకు దైవభక్తి, జాతకాల మీద బాగా నమ్మకం ఉంటుంది. కానీ ఈయన ఎందుకో నమ్మడు. సో.. నమ్మకపోతే ఎవరికి నష్టం.. ఆయనకు, ఆయన చుట్టూ ఉన్న వాళ్లకే కదా. ప్రభాస్ ఒక వ్యవస్థ.. ఆయన్ను నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. సో.. ఆయన బాగుంటే అందరూ చల్లగా ఉంటారు. కానీ అలాంటి ఆలోచనలు ఆయనకు లేనప్పుడు మనం ఏమీ చేయలేం. మనం ఇలా చెప్పి బాధపడటం తప్ప చేసేదేమీ లేదు. ప్రభాస్ జాతకం మాత్రం చాలా వరస్ట్‌గా ఉంది’ అని ప్రభాస్ పరిస్థితిపై బాంబ్ పేల్చాడు వేణుస్వామి.

Prabhas Astro In 2023

వాస్తవానికి వేణుస్వామి చెప్పినవి చాలానే జరిగాయ్.. జరుగుతున్నాయ్ కూడా. మరి ప్రభాస్ విషయంలో ఈయన చెప్పింది ఏ మాత్రం జరగబోతోంది అనేది పెద్ద టాస్కే. ఈ జాతకంపై ప్రభాస్ ఫ్యాన్స్, సినీ ప్రియులు సైతం విస్మయానికి గురవుతున్నారు. ఇలాంటి విషయాలపై ప్రభాస్ నిజంగానే చాలా కోపిష్టిగా వ్యవహరిస్తుంటారు. మరి ఫైనల్‌గా డార్లింగ్ నుంచి రియాక్షన్ ఉంటుందా..? ఉంటే ఎలా ఉండబోతోంది..? అనేది వేచి చూడాల్సిందే.

Google News