Samantha: సమంత ఆరోగ్యంపై షాకింగ్ వార్త.. అయ్యో ఏంటిది..!?

Samantha Health

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ దక్షిణ కొరియాలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడానికి వీలుకాదని వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే సామ్ ఆరోగ్యంపై అటు సోషల్ మీడియాలో.. ఇటు మెయిన్‌స్ట్రీమ్, డిజిటల్ ఫ్లాట్‌పామ్‌లలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటన్నింటికీ సమంత మేనేజర్ క్లారిటీ వివరణ కూడా ఇచ్చారు. అయితే తాజాగా మరో షాకింగ్ వార్త ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అదేమిటంటే.. మయోసైటీస్‌ నుంచి కాస్త బయటిపడినా ఇది వరకటిలా ఎక్సర్‌సైజ్ చేయడానికి బాడీ సహకరించదట. మరీ ముఖ్యంగా ఎలాంటి బరువులు ఎత్తకూడదని సామ్‌ (Samantha Ruth Prabhu) కు డాక్టర్లు చెప్పారట. అంతేకాదు.. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేం కానీ ప్రాణంతకంగా మారకుండా మాత్రం చేయడానికి ప్రయత్నాలు చేస్తామని వైద్యులు చెప్పినట్లు తెలియవచ్చింది. పొరపాటున వర్కౌట్స్ చేస్తే మాత్రం కండరాల నొప్పి నుంచి సామ్ కోలుకోలేదట.

Samantha Health

హీరోయిన్లు అంటేనే అంద చందాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మరీ ముఖ్యంగా సామ్ తన ఫిట్‌నెస్ విషయాలు హెవీ వర్కౌట్స్ చేస్తుంటుంది. ఇప్పుడు డాక్టర్లు చెప్పిన మాటల తర్వాత ఈ ముద్దుగుమ్మ ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాలి. ఏదేమైనా.. ఈ పాడు మయోసైటీస్‌తో సామ్ (Samantha) పూర్తిగా నలిగిపోతోందని అభిమానులు, సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Google News