Sreeleela: శ్రీలీలా.. ఏంటీ పిచ్చిపని.. ఎందుకిలా పాడు చేసుకున్నావ్..?

sreeleela

సినిమా అంటే రంగుల ప్రపంచం.. అందం, అభినయం అంతకుమించి నటనతోనే ఇక్కడ పని. అందంగా ఉండాలని హీరో, హీరోయిన్లు నిద్ర లేచింది మొదలుకుని నిద్రపోయే వరకూ అహర్నిశలూ కష్టపడుతుంటారు. ఎన్నో డైట్స్ మెయింటైన్ చేస్తుంటారు. అంతేకాదు ప్రాణాంతకమైన సర్జరీలకు సైతం వెనకాడకుండా రెడీ అయిపోతుంటారు. ఇప్పటికే ఇలా సర్జరీలు చేయించుకున్న నటీనటులు చాలా మందే ఉన్నారు. వారిలో కొందరికి సక్సెస్ అవ్వడంతో ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.. ఇంకొందరైతే ప్రాణాలు విడిచిన వాళ్లు కూడా ఉన్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. తాజాగా యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) సర్జరీ చేయించుకుందన్న వార్త ముద్దుగుమ్మ ఫ్యాన్స్, నెటిజన్లలో అలజడి రేపుతోంది. ఈ భామ పెదాలు మునుపటితో పోలిస్తే చాలా తేడాగా ఉన్నాయి. దీంతో ఇండస్ట్రీకి వచ్చినప్పటి ఫొటోలను తాజా ఫొటోలతో పోలుస్తూ.. ‘అయ్యో పిచ్చి తల్లీ ఎందుకిలా చేశావ్..’ అని కొందరు కామెంట్ చేస్తుండగా.. ‘మరికొందరు పెదాలను ఎందుకిలా చేశావమ్మాయ్.. ఇలాంటి సర్జరీలు చేయించుకుంటే ఫ్యాన్స్ ఏమవ్వాలి.. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు’ అని సలహాలిస్తున్నారు. మరి ఇందులో నిజానిజాలెంటో ముద్దుగుమ్మకే తెలియాలి.

sreeleela

ఇప్పుడు టాలీవుడ్‌లో జూనియర్, సీనియర్ హీరో అనే తేడా లేకుండా నటించేస్తోంది శ్రీలీల (Sreeleela). మరీ ముఖ్యంగా ఈ యంగ్ బ్యూటీ డ్యాన్స్‌కు కుర్రకారు బాగా ఫిదా అయిపోయారు. అందం, చందం అంతకుమించి నటన ఉన్న ఈ భామ అనవసరంగా పెదాలకు సర్జరీ చేయించుకుని పాడు చేసుకోవడం ఎంతవరకు కరెక్టో.. అసలు ఈ పిచ్చి సలహా ఇచ్చిన వ్యక్తెవరో మరి. ఏదేమైనా సర్జరీలో ఒక స్థాయి వరకైతే ఓకే.. అది శృతి మించితే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో మునపటి ఘటనలే అందుకు చక్కటి ఉదాహరణ. సో.. కాస్త ఆలోచించు బేబీ.. ఇవన్నీ అవసరమా..!

Google News