Varasudu Trailer: మీమర్స్‌కి ఫుల్ స్టఫ్ ఇచ్చేసిన ‘వారసుడు’ ట్రైలర్..

Varasudu trailer troll

ఇప్పుటికే రెండు బడా హీరోల సినిమాలకు ఎదురొచ్చి వార్తలకెక్కిన ‘వారసుడు’ (Varasudu) సినిమా..ఇప్పుడు మరింత తెలుగు వాళ్ల నోళ్లలో నానుతోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో దీని ట్రైలర్‌ (Varasudu Trailer)ను తాజాగా చిత్ర యూనిట్ వదిలింది. ఇది చూసిన దగ్గర నుంచి సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులకు సినిమా ఎలా ఉండబోతోందో అనే క్లారిటీ అయితే వచ్చేసింది.

Varasudu Trailer Troll 2

తాజాగా వారసుడు (Varasudu) చిత్ర యూనిట్ తమిళ్‌తో పాటు తెలుగు సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. తమిళ్‌లో రెస్పాన్స్ గురించి మనకు అవసరం లేదు కానీ తెలుగు రెస్పాన్స్ అయితే బీభత్సం.. అల వైకుంఠమురములో (Ala Vaikuntapuramlo), బృందావనం (Brindavanam), బ్రహ్మోత్సవం (Brahmotsavam), మహర్షి (Maharshi), అజ్ఞాతవాసి (Agnathavasi) .. ఇలా మరికొన్ని సినిమాలను మిక్సీలో వేసి తీస్తే.. ఫైనల్‌గా ఎలా ఉంటుందో అలా ఉందంటున్నారు ప్రేక్షకులు.

Varasudu Trailer Troll

మరి చిత్ర యూనిట్ ఇంత స్టఫ్ ఇచ్చాక మీమర్స్ ఆగుతారా? చెలరేగిపోతున్నారనుకోండి. ప్రతీ సీన్ ఎక్కడో విన్నట్టుగానూ.. చూసినట్టుగానూ ఉందంటూ నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. ఇక తమన్ ఏమైనా తక్కువ తిన్నాడా? అసలే కాపీ క్యాట్ అనే పేరు ఎలాగూ ఉండనే ఉంది కదా.. అల వైకుంఠపురములో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను యాజ్‌టీజ్‌గా దించేశాడని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మరోవైపు దిల్ రాజు చూస్తేనేమో కచ్చితంగా హిట్ కొడతామని ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. ఇక ట్రైలర్‌లో లేనిదేదో సినిమాలో ఉంటే తప్ప సాధ్యం కాదనే టాక్ బలంగా వినిపిస్తోంది. చూడాలి మరి సినిమా ఏమవుతుందో..

https://twitter.com/BUNKSEENU9669/status/1610663804635058176
Google News