Sharwanand: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్ట్ నుంచి సైలెంట్‌గా సైడ్ అయిపోతున్న శర్వా

Sharwanand

కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే తప్ప సినిమా జోలికి వెళ్లని అతి కొద్ది మంది హీరోల్లో శర్వానంద్ (Sharwanand) ఒకరు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి ఊసేలేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌ లిస్ట్‌లోనూ మనోడు ఉంటాడు. తన పెళ్లెప్పుడని ఓ షోలో అడిగితే ప్రభాస్ పెళ్లి తర్వాత అని చెప్పి తప్పించుకున్నాడు. కానీ కల్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఆగదు అంటారు కదా..మనోడికి కల్యాణ ఘడియలు రానే వచ్చేశాయి.

శర్వానంద్ (Sharwanand) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్ట్ నుంచి బయటపడి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. మనోడు చాలా సాఫ్ట్‌గా కనిపిస్తాడు కాబట్టి పెద్దలు కుదిర్చిన వివాహం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. పక్కాగా ప్రేమించిన అమ్మాయితోనే శర్వా ఏడడుగులు వేయబోతున్నాడట. అమ్మాయి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అట. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోంలో భాగంగా హైదరాబాద్‌లోనే ఉందట.

Sharwanand

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఈ ముద్దుగుమ్మతో శర్వా ఎప్పుడు ప్రేమలో పడ్డాడో కానీ.. వ్యవహారాన్ని త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కించబోతున్నాడని టాక్. పదేళ్ల క్రితం అంటే తన 28వ ఏట సినీ రంగంలో అడుగు పెట్టిన శర్వా కెరీర్‌లో ఎక్కువగా హిట్సే పడ్డాయి. మంచి నటనతో అద్భుతమైన పేరును సంపాదించుకున్నాడు.

Google News