Sreeja: శ్రీజకు చిరు కాస్ట్లీ గిఫ్ట్.. అదేంటో తెలిస్తే..

Chiranjeevi gift to sreeja

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. మెగాస్టార్ (Chiranjeevi) తలుచుకుంటే గిఫ్ట్‌లకు కొదువా? అసలే చిన్న కూతురంటే ఏ తండ్రికి ఇష్టం ఉండదు చెప్పండి. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ (Sreeja) ఆ కుటుంబంలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇంటి నుంచి పారిపోయి ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిన శ్రీజ (Sreeja) కొద్ది కాలానికే అతనికి గుడ్ బై చెప్పేసి కల్యాణ్ దేవ్‌తో పెళ్లి పీటలు ఎక్కేసింది.

ఇక కల్యాణ్ దేవ్‌తో పెళ్లి కూడా ముణ్ణాళ్ల ముచ్చటే అయింది. ఇప్పుడు ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమవుతోందనే టాక్ గత కొంత కాలంగా వినిపిస్తోంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా శ్రీజ పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2022 తనకు ఎన్నో ఇచ్చిందని.. తన జీవితానికి ఒక కొత్త మార్గాన్ని తనను ఎంతో ఇష్టపడే వ్యక్తిని దగ్గర చేసిందని ఆ ఏడాదికి థాంక్యూ కూడా చెప్పేసింది.

Chiranjeevi gift to sreeja

ఇక రీసెంట్‌గా శ్రీజ (Sreeja)కు సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. తన ముద్దుల కూతురు కోసం చిరు.. రూ.35 కోట్లతో ఒక బంగ్లాను కొనుగోలు చేసి ఆమెకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మూడో పెళ్లి చేసుకున్న అనంతరం శ్రీజ తన భర్తతో కలిసి ఇదే బంగ్లాలో కాపురం చేయబోతోందట. చిన్న కూతురి సంతోషం కోసం చిరు ఏం చేయడానికైనా వెనుకాడరని దీన్ని బట్టి తెలుస్తోంది. ఇక శ్రీజ మూడో పెళ్లిపై అయితే ఇప్పటి వరకూ మెగా ఫ్యామిలీ ఎక్కడా స్పందించలేదు.

Google News