Adipurush Tickets: ఆదిపురుష్ దెబ్బకు అల్లాడిపోయిన బుక్ మై షో

Adipurush Tickets: ఆదిపురుష్ దెబ్బకు అల్లాడిపోయిన బుక్ మై షో 

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఆదిపురుష్ చిత్రం శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6200 స్క్రీన్లలో విడుదల కానుంది. దీనికి సంబంధించి మంగళవారం రాత్రి నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఓపెన్ అయ్యి అవగానే టికెట్స్ కోసం ప్రేక్షకులు ఎగబడ్డారు. దీంతో బుకింగ్స్ ప్రారంభమైన గంటల్లోనే బుక్ మై షో(Book My Show) సైట్ క్రాష్ అయింది.

ఇక తెల్లవారుజామున 4 గంటల వరకూ సైట్ క్రాష్ అవడంతో బుకింగ్స్ ఆగిపోయాయి. ఆ తర్వాత ఆసక్తికరంగా బుకింగ్స్ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే కేవలం శుక్రవారానికి సంబంధించిన టికెట్లే కాకుండా.. శని, ఆదివారాలకు సంబంధించిన టికెట్స్ కూడా అమ్ముడయ్యాయని సమాచారం. అసలే అంచనాలు ఆకాశాన్నంటుతుండటంతో బుకింగ్స్‌ బీభత్సంగా జరిగిపోయాయి. 

Adipurush Tickets: ఆదిపురుష్ దెబ్బకు అల్లాడిపోయిన బుక్ మై షో 

తొలి రోజే ఈ సినిమా షాకింగ్ స్థాయిలో వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఆదిపురుష్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ.100 కోట్ల వరకూ వచ్చినట్లు సమాచారం. ఇక ఓటీటీ రైట్స్ కూడా బీభత్సంగానే అమ్ముడయ్యాయి. అమెజాన్ ప్రైమ్ ఆదిపురుష్(Adipurush) ఓటీటీ రైట్స్‌ను రూ.250 కోట్లకు దక్కించుకున్నట్టు సమాచారం. ఈ సినిమా ఓటీటీ రైట్స్, తొలి రోజు వసూళ్లతోనే చాలా వరకూ నెట్టుకొచ్చింది.

ఇవీ చదవండి:

10 వేల మందికి ఉచితంగా ‘ఆదిపురుష్’ టికెట్లు.. ప్రకటించిన నిర్మాత

ఆదిపురుష్ తెలుగు టార్గెట్ రూ.150 కోట్లు.. తేడా వచ్చిందో..

అదే జరిగితే ఆదిపురుష్‌కి తీరని నష్టం కలుగుతుందని ఫ్యాన్స్ టాక్..

Google News