Adipurush: ఆదిపురుష్ తెలుగు టార్గెట్ రూ.150 కోట్లు.. తేడా వచ్చిందో..

Adipurush: ఆదిపురుష్ తెలుగు టార్గెట్ రూ.150 కోట్లు.. తేడా వచ్చిందో..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఆదిపురుష్(Adipurush) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కింది. ఈ సినిమాను తెలుగులో ప్రభాస్ (Prabhas) సన్నిహిత మిత్రులు యువి సంస్థ అధినేతలు విడుదల చేస్తున్నారు. మైథలాజికల్ మూవీ కావడంతో ఈ సినిమాకు గ్రాఫిక్సే ప్రాణం. గ్రాఫిక్స్ దెబ్బేస్తే ఎలా ఉంటుందనేది శాకుంతలం(Shaakuntalam) సినిమాతోనే నిర్మాతలకు బాగా అర్ధమై ఉంటుంది. అందునా ఆదిపురుష్(Adipurush) మూవీ కీలకంగా రామాయణంలోని యుద్ధ కాండను బేస్ చేసుకుని ఉంటుంది.

మొత్తానికి ఆదిపురుష్‌(Adipurush Movie)కు గ్రాఫిక్సే కీలకం. కాబట్టి ప్రస్తుత జనరేషన్‌ను నచ్చేలా చిత్ర యూనిట్ గ్రాఫిక్స్‌ను వాడుతోంది. అయితే ఈ సినిమా తెలుగు హక్కులు దాదాపు 150 కోట్ల పైమాటే అని సమాచారం. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్ర, సీడెడ్, తెలంగాణ, కర్ణాటక కలిపి దాదాపు 150 కోట్ల మేరకు మార్కెట్ చేయాల్సి వుంది. నిజానికి ఇదేమీ భారీ మొత్తం కాదు. పాన్ ఇండియా స్థాయి మూవీకి ఇదొక లెక్కా కాదు.

Adipurush: ఆదిపురుష్ తెలుగు టార్గెట్ రూ.150 కోట్లు.. తేడా వచ్చిందో..

కేజీఎఫ్ 2(KGF2) మూవీ నైజాంలో 70 కోట్లు వసూలు చేసింది. ఈ లెక్కన ఆదిపురుష్(Adipurush) 150 కోట్లంటే పెద్ద లెక్కేం కాదు కానీ మైథలాజికల్ సినిమా విషయంలో ఏ చిన్న తప్పు దొర్లినా కూడా చిక్కుల్లో పడిపోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ చూసి జనాలు చాలా గొడవ చేశారు. దీంతో సినిమా విడుదల చాలా ఆలస్యమైంది. సినిమా బాగుందంటే ఎవరు పట్టుకున్నా జనం ఆగరు. కానీ కాస్త డిజప్పాయింట్ చేసినా కూడా సినిమా అస్సామే. ఏది ఏమైనా ప్రభాస్(Prabhas) సినిమాకు ఓపెనింగ్స్ మాత్రం దుమ్ము రేపుతాయనడంలో సందేహం లేదు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!