Ram Charan: చెర్రీ విషయంలో ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుండేదని ఫీలవుతున్న చిరు

Ram Charan: చెర్రీ విషయంలో ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుండేదని ఫీలవుతున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై ఉన్న అవగాహన అపారం. అందుకే ఆయన సినిమాలకు సక్సెస్ రేటు చాలా ఎక్కువ. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్నాళ్లకే ఆయన జనం నాడిని పట్టుకున్నారు. అప్పట్లోనే ఆయన చేసిన సినిమాలు దాదాపు హిట్.

ఇక ఆయన బాటలోనే ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పయనిస్తున్నారు. చెర్రీ అంతలా సక్సెస్ అయ్యారంటే దాని వెనుక మెగాస్టార్ హస్తం లేకపోలేదు. అప్పట్లో రామ్ చరణ్ సినిమాలకు కథను ఆయనే సెలక్ట్ చేసేవారు.

అయితే ఒకానొక సమయంలో చరణ్ విషయంలో చిరంజీవి చాలా పెద్ద తప్పు చేశారట. అప్పట్లో చెర్రీ కోసం చిరు ఓ కథను సెలెక్ట్ చేశారు. ఆపై ఆ సినిమాలో చెర్రీ నటించారు. అది కాస్తా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఆ సినిమానే హిందీలో జంజీర్‌గానూ.. తెలుగులో తుఫాన్‌గా విడుదలైంది. జంజీర్ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా నటించింది. ఎందుకోగానీ ఆ సినిమా చెర్రీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

Ram Charan and Priyanka Chopra in Zanjeer movie

చిరు తొందరపాటు కారణంగా చెర్రీకి చాలా పెద్ద దెబ్బ పడింది. నిజానికి ఆ సినిమా హిట్ అయి ఉంటే.. బాలీవుడ్‌లో చెర్రీ కెరీర్ అద్భుతంగా ఉండేది. అలాంటిది చిరు కథను సరిగా సెలక్టు చేయకపోవడంతో చెర్రీ బాలీవుడ్ అడుగులు ఆదిలోనే అంతమయ్యాయి.

సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ న్యూస్ విని మెగాస్టార్ చాలా బాధ పడ్డారట. అంతేకాదు.. చెర్రీ విషయంలో తాను తీసుకున్న నిర్ణయానికి ఆయన ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారట.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!