Anchor Jhansi: ఎంతో మంది నన్ను మోసం చేశారు : యాంకర్ ఝాన్సీ

Anchor Jhansi: ఎంతో మంది నన్ను మోసం చేశారు : యాంకర్ ఝాన్సీ

తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్స్‌గా వెలుగొందిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో ఝాన్సీ ఒకరు. హింట్ ఇస్తే చాలు అల్లుకుపోయి మరీ యాంకరింగ్ చేస్తుంది. చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌కి యాంకరింగ్ చేస్తూ మొదలె పెట్టిన కెరీర్‌ని ఆమె ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది.

వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులను దాటుకుంటూ ముందుకెళ్లి స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఆపై వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకుని మంచి నటిగా కూడా ఝాన్సీ గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా ఝాన్సీ తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఇప్పటి వరకూ 45 సినిమాల్లో నటించినప్పటికీ ఎందుకో ఝాన్సీ వెండితెరపై కూడా పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది. ఝాన్సీ కెరీర్ అంతా సవ్యంగా సాగలేదు.

Anchor Jhansi

ఇక రియల్ లైఫ్‌లోనూ కొన్ని చేదు సంఘటనలు ఉన్నాయని ఝాన్సీ తెలిపింది. కొత్తలో అంతా తనకు పొగరు ఉండేదని అనుకునే వారని.. కానీ అందులో వాస్తవం లేదన్నారు. అసలు తానేంటనేది తనతో పని చేసిన వారికి తెలుసన్నారు.

తాను చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ కారణంగా తనను అంతా ఫైర్ బ్రాండ్ అని పిలిచేవారు. తనను అర్ధం చేసుకున్నవారు మాత్రం తనతో పాటు కొన్నేళ్ల పాటు జర్నీ చేశారన్నారు. నచ్చని వాళ్లు కొన్ని ఎపిసోడ్స్‌తోనే తనకు ఫుల్ స్టాప్ పెట్టారన్నారు. ఓ డ్యాన్స్ షఓకి 99 ఎపిసోడ్స్‌కి తాను యాంకరింగ్ చేశానని.. 100వ ఎపిసోడ్‌కి మాత్రం తనతో కాకుండా వేరొకరితో చేయించారన్నారు. కారణం ఎందుకని తాను అడగలేదని.. వారు కూడా చెప్పలేదన్నారు. తనను చాలా మంది మోసం చేశారని.. వారందరినీ గుర్తు పెట్టుకుని కక్ష సాధించే ఉద్దేశం తనకు లేదని ఝాన్సీ తెలిపారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!