Kushi: ఖుషీ సినిమా కోసం శివ నిర్వాణ ప్రయోగం.. మణిరత్నం హిట్స్‌తో..

Kushi: ఖుషీ సినిమా కోసం శివ నిర్వాణ ప్రయోగం.. మణిరత్నం హిట్స్‌తో..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), స్టార్ హీరోయిన్ సమంత(Samantha) కలిసి నటిస్తున్న సినిమా ఖుషీ(Kushi). విజయ్ లైగర్ డిజాస్టర్.. సామ్‌కి శాకుంతలం దెబ్బేసిన తర్వాత ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

అయితే ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ పాటను అందించారు. టక్ జగదీష్ తర్వాత శివ నిర్వాణ(Shiva Nirvana) ఈ చిత్రం కోసం తిరిగి పాట రాశారు. 

Kushi director Shiva Nirvana

ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ పాటను ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆల్ టైం హిట్స్ ఆధారంగా రాశారు. సినిమా పాట రాయడమేనేది ఒక పెద్ద కసరత్తు. అలాంటిది టైటిల్స్‌తో పాట రాయడమంటే అదొక సాహసోపేత నిర్ణయమే. ఒక పాట రాయాలంటే సంధులు, సమాసాలు, ప్రాసలు వంటి వన్నీ చూడాల్సి ఉంటుంది. అలాంటిది కేవలం సినిమా పేర్ల ఆధారంగా పాట రాయాలంటే.. అదొక సాహసోపేత నిర్ణయమే. దాదాపు పెద్దగా ఇలాంటి సాహసాల జోలికి ఎవరూ వెళ్లరు.

Kushi Telugu Movie

గతంలో దాసరి మనుషులంతా ఒక్కటే, బాలచందర్ మరో చరిత్ర లాంటి క్లాసిక్ చిత్రాల్లో మాత్రమే ఇలాంటివి చేసి సక్సెస్ అయ్యారు. ఇక ఖుషి సినిమా నుంచి శివ నిర్వాణ రాసిన పాట నేడు విడుదలైంది. దీనిలో చాలా టైటిల్స్‌ని పొందుపరిచారు.

మణిరత్నం(Mani Ratnam) ఆల్ టైం హిట్స్ రోజా, సఖి, చెలియా, అంజలి, గీతాంజలితో పాటు దళపతి కూడా వచ్చేలా శివ నిర్వాణ చూసుకున్నారు. ఖుషీ సినిమాతో టాలీవుడ్‌కు మలయాళం ఫేమ్ హేశం అబ్దుల్ వాహబ్ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Google News