Puri Jagannadh: రూమర్స్‌కి ఫోటోలతో చెక్ పెట్టిన పూరీ జగన్నాథ్

Puri Jagannadh: రూమర్స్‌కి ఫోటోలతో చెక్ పెట్టిన పూరీ జగన్నాథ్

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్(Puri Jagannadh) ఒకడు. ఇప్పుడు ఆయన అంతగా రాణించలేకపోయినా కూడా ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేశారు. కథ, టేకింగ్, డైలాగ్స్, యూత్ ని అప్రోచ్ అయ్యే తీరు అద్భుతమనే చెప్పాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న ఎంతో మంది స్టార్స్.. ఆయన దర్శకత్వంలో పరిచయమైన వారే. లైగర్ మూవీ రూపొందించడం.. ఆ తర్వాత మూవీ డిజాస్టర్ నేపథ్యంలో ఆయనపై చాలా రూమర్స్ వచ్చాయి. వాటిలో భార్యతో విడాకుల అంశం ఒకటి.

కనీసం పూరీ తన కుమారుడి మూవీ ఈవెంట్‌కు కూడా హాజరు కాలేదు. దీంతో పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. పూరి(Puri Jagannadh) కావాలనే ఫ్యామిలీకి దూరంగా ముంబయిలో ఉంటున్నారని, ఛార్మీ(Charmme)తోనే పర్మినెంట్‌గా ఉండిపోయారంటూ ప్రచారం జోరుగా జరిగింది. అంతేకాదు.. ఒకడుగు ముందుకేసి మరీ పూరీ తన భార్యకు విడాకులు కూడా ఇస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఆ పుకార్లపై పూరీ కుమారుడు ఆకాశ్‌ సైతం అబద్ధాలని చెప్పాడు. అయినా ఆగితేనా?

Puri Jagannadh with his wife

తాజాగా పూరి(Puri Jagannadh) ఆ పుకార్లన్నింటికీ చెప్ప పెట్టేశారు. కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ రూమర్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టేశారు. పూరి తన సొంతులు నర్సీపట్నంలో భార్యాపిల్లలతో కలిసి సందడి చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌.. ఈ ఫోటోలపై స్పందించారు. చాలా సంతోషంగా ఉందంటూ కామెంట్ పెట్టారు. ఇక ఇప్పటికైనా పూరీపై వస్తున్న రూమర్స్ ఆగుతాయో లేదో చూడాలి.

Google News