Raviteja: రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న రవితేజ

Raviteja: రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న రవితేజ

హీరో రవితేజ(Raviteja)కు టైం చాలా బాగున్నట్టుంది. ఈ మధ్య హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే రెమ్యూనరేషన్‌ను సైతం భారీగా పెంచేస్తున్నాడు. ఒక హిట్ వచ్చిందంటే.. ఆ తరువాత రెండు, మూడు సినిమాలు ఫట్.. ఇలాగే సాగుతోంది రవితేజ(Raviteja) కెరీర్. క్రాక్ మూవీ హిట్.. ఖిలాడి(Khiladi), రామారావు ఆన్ డ్యూటీ(Ramarao On Duty) డిజాస్టర్స్. ధమాకా(Dhamaka) మూవీ హిట్.. తాజాగా వచ్చిన రావణాసుర(Ravanasura) ఫట్.

ధమాకా, రావణాసురకి మధ్యలో వచ్చిన వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) హిట్ అయినప్పటికీ రవితేజ(Raviteja)ది గెస్ట్ రోల్ కావడంతో క్రెడిట్ మొత్తం చిరంజీవి(Chiranjeevi) అకౌంట్‌లో పడిపోయింది. అయితే ఫ్లాప్స్ పడుతున్నా కూడా రవితేజ(Raviteja) మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ అవడం లేదట. ప్రస్తుతం కలర్ ఫోటో ఫేమ్ సందీప్‌తో సినిమాను చేయబోతున్నాడు. దీనికి రూ.25 కోట్లు డిమాండ్ చేశాడని టాక్. రూ.25 కోట్లు ఇస్తేనే సినిమా చేస్తానని తెగేసి మరీ చెబుతున్నాడట.

Raviteja: రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న రవితేజ

రవితేజ డిమాండ్‌తో చేసేదేమీ లేక ఆయన అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సైతం సిద్ధమయ్యారని తెలుస్తోంది. నిజానికి రవితేజ(Raviteja) ఇటీవలి కాలంలో నటించిన సినిమాల్లో ఒక్క వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) మినహా ఏ సినిమా కూడా రూ.40 కోట్ల వరల్డ్ వైడ్ షేర్‌ను దాటలేదు. ఇక రావణాసుర అయితే కేవలం రూ.12 కోట్ల లోపే. అలాంటి రవితేజ(Raviteja).. తనకు రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ కావాలని అడగడం విడ్డూరం. డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు కొంత సమకూరుతోంది కాబట్టి సరిపోయింది లేదంటే కష్టల్లో పడేవారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!