Custody Twitter Review: కస్టడీ మూవీ ట్విటర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే..

Custody Twitter Review

Custody Twitter Review:

నాగచైతన్య(Naga Chaitanya). కృతి శెట్టి(Krithi Shetty) జంటగా నటించిన చిత్రం కస్టడీ(Custody). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రూపొందింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ మూవీ ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్ షో పడిపోయింది.

సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా సినిమాపై రివ్యూCustody Review) ఇస్తున్నారు. నాగచైతన్య. కృతి శెట్టి ఇద్దరికీ ఈ చిత్రం కీలకమే. ఈ చిత్రం సక్సెస్ అయితే తప్ప కెరీర్ గాడిన పడదు. మరి ఈ సినిమా వారిద్దరికీ కలిసొచ్చిందా? ప్రేక్షకులు ఏమంటున్నారో చూద్దాం.

నాగ చైతన్య, అరవింద స్వామి(Aravind Samy) పెర్ఫార్మన్స్‌కు మాత్రం ప్రేక్షకులు మూకుమ్మడిగా మంచి మార్కులు వేస్తున్నారు. కృతి శెట్టి సైతం తన పాత్రకు న్యాయం చేసిందనే టాక్ వినిపిస్తోంది. కస్టడీ(Custody) కథ, కథనం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదంటున్నారు. కథ, కథనాల్లో పెద్దగా దమ్ములేదని ప్రేక్షకులు చెబుతున్నారు. కస్టడీ మూవీ స్లోగా మొదలవుతుందని.. నెరేషన్ అంతా ప్రిడిక్టబుల్‌గా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. కస్టడీ(Custody) ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ సన్నివేశాలతో నడిపించాడని.. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం పర్వాలేదని అంటున్నారు.

Custody Twitter Review

యువన్ శంకర్‌ రాజా(Yuvan Shankar Raja) నేపథ్య సంగీతం బాగుందని కానీ సాంగ్స్ మాత్రం అతి పెద్ద మైనస్ అని అంటున్నారు. కొన్ని సన్నివేశాల్లో వేరే సినిమాల్లో చూసినట్టుగా ఉంటాయట. కొన్ని సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయట. ఇక ఎడిటింగ్ అయితే పర్వాలేదంటున్నారు. సినిమాటోగ్రఫీకి మాత్రం మంచి మార్కులే పడుతున్నాయి. మొత్తానికి నాగ చైతన్య(Naga Chaitanya) కెరీర్‌కు మాత్రం ఓ మెమరబుల్ మూవీ అవుతుందని ఓ నెటిజన్ తెలిపాడు. ఓవరాల్‌గా చూస్తే కస్టడీ(Custody) సినిమా సక్సెస్‌కు 50 – 50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!