Shalini Pandey: కష్టాల్లో షాలినీ పాండే కెరీర్.. బాలీవుడ్‌లోనూ డోర్స్ క్లోజ్..

Shalini Pandey: కష్టాల్లో షాలినీ పాండే కెరీర్.. బాలీవుడ్‌లోనూ డోర్స్ క్లోజ్..

కొంతమంది హీరోయిన్స్ ఇలా మెరిసి అలా మాయమవుతారు. ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఆ తరువాత ఎందుకో కనుమరుగై పోతారు. గీతాంజలి(Geetanjali) మూవీ హీరోయిన్ కూడా అంతే. నాగార్జున (Nagarjuna) హీరోగా వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పనక్కర్లేదు. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో చెప్పనక్కర్లేదు.

ఈ జబల్ పూర్ చిన్నది అర్జున్ రెడ్డి(Arjun Reddy) మూవీ తర్వాత ఒకటి, రెండు సినిమాలు చేసి కనుమరుగై పోయింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. కానీ కొంతలో కొంత ఫేమ్ తెచ్చుకున్న షాలిని(Shalini Pandey) మాత్రం గాయబ్ అయిపోయింది. కేవలం కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ 118 మూవీలో షాలిని పాండే(Shalini Pandey)కు మరోసారి లీడ్ హీరోయిన్ ఆఫర్ దక్కింది. కానీ అమ్మడికి ఏమాత్రం కలిసి రాలేదు.

Shalini Pandey: కష్టాల్లో షాలినీ పాండే కెరీర్.. బాలీవుడ్‌లోనూ డోర్స్ క్లోజ్..

ఆ తరువాత రాజ్ తరుణ్‌(Raj Tarun)తో మూవీ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ క్రమంలో అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ నిశ్శబ్దంలో కీ రోల్ చేసినా కూడా కలిసి రాలేదు. సరేలే అని బాలీవుడ్‌లో ఓ మూవీ చేసినా కూడా అదీ గోవిందా. రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన జయేష్ భాయ్ జోర్దార్ మూవీ అట్టర్ ఫ్లాప్‌తో బాలీవుడ్‌లో తలుపులు కూడా దాదాపు మూసికుపోయినట్టేనని తెలుస్తోంది. మొత్తానికి షాలిని పాండే కెరీర్ కష్టాల్లో పడిపోయింది.

Google News