Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌ ద్వారా పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌ ద్వారా పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇటీవలి కాలంలో తన సినిమాలు పొలిటికల్ కెరీర్‌కు ప్లస్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఆయన ప్రతి సినిమాలోనూ దేశభక్తి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకో ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఈ క్రమంలోనే నేడు ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) గ్లిమ్స్ విడుదలైంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క సీన్‌ను పొలిటిక్స్‌కు అన్వయించుకుని జగన్‌(YS Jagan)కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంటూ ప్రచారం చేస్తున్నారు.

కేవలం నిమిషం నిడివి కలిగిన టీజర్లో సీఎం జగన్‌కి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ గ్లిమ్స్.. దుర్మార్గం హద్దులు దాటినప్పుడు భగవంతుడు అవతరిస్తాడనే భగవద్గీత శ్లోకంతో మొదలవుతుంది. అంటే ఏపీలో దుర్మార్గపు పాలన నడుస్తుందని పరోక్షంగా పవన్ చెప్పారని అంటున్నారు. అలాగే టీజర్లో రెండు సార్లు జనసేన(Janasena) పార్టీ సింబల్ గాజు గ్లాస్ చూపించారు. మరి ఇది అనుకోకుండా జరిగిందో.. కావాలని చూపించారో తెలియదు.

Ustaad Bhagat Singh

ఇక గ్లిమ్ప్స్ చివర్‌లో ఒక డైలాగ్ ఉంది. అది సీఎం జగన్‌కి గట్టి వార్నింగ్ అని చెప్పుకుంటున్నారు. అసలు చివరిలో ‘ఈ సారి పెర్ఫార్మన్స్ మాములుగా ఉండదు’ అని పవన్(Pawan Kalyan) లాస్ట్‌లో డైలాగ్ చెప్పారు. అది నేరుగా వైసీపీ ప్రభుత్వానికి ఆయన పంపిన హెచ్చరిక అంటూ బీభత్సంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది.

Google News