Adipurush: అదే జరిగితే ఆదిపురుష్‌కి తీరని నష్టం కలుగుతుందని ఫ్యాన్స్ టాక్..

Adipurush

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్(Prabhas), కృతి సనన్(Kriti Sanon) జంటగా రూపొందుతున్న చిత్రం ‘ఆదిపురుష్’(Adipurush). ఈ చిత్రం ఎందుకో గానీ ఆది నుంచి కూడా ఫ్యాన్స్‌కి అంతగా నచ్చడం లేదు. ప్రతి విషయంలోనూ ఏదో ఒక అడ్డంకి. ప్రభాస్(Prabhas) ఏ మూవీకి రానన్ని ట్రోల్స్ ఈ మూవీకి వచ్చాయి. ఈ మూవీ విడుదలకు ముందే ఎందుకోగానీ ఫ్యాన్స్ ఫ్లాప్ అవుతుందని భయపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఇక ఈ టీజర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్‌కి చిర్రెత్తుకొచ్చినట్టుంది.

దర్శకుడు ఓం రౌత్‌(Om Raut)పై ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. సినిమా టీజర్ చూసినట్టుగా లేదని.. కార్టూన్ ఛానల్ చూసినట్టుందంటూ మండిపడ్డారు. రూ.500 కోట్లు తగలేసి మీరు తీసింది ఒక కార్టూన్‌నా? ఇందుకేనా మా హీరో సమయాన్ని ఇంత కాలం వృథా చేశారంటూ ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మూవీ టీం గ్రాఫిక్స్ రీ వర్క్ చేయించడం కోసం మరో ఆరు నెలల సమయం తీసుకున్నారు. ఈ సారి గ్రాఫిక్స్ అదిరిపోతాయట. కచ్చితంగా ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతుందని మూవీ టీం చెబుతోంది.

Prabhas in Adipurush

సినిమాని జూన్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్యంగా అన్ని ప్రాంతీయ బాషలలో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్‌గా ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. త్వరలో ఈ మూవీ ట్రై బెకా ఫిలిం ఫెస్టివల్ లో జూన్ 13న ప్రదర్శించబోతున్నారని సమాచారం. అయితే ఇదే కనుక విడుదలైతే మాత్రం ఆన్‌లైన్‌లో లీక్ అయ్యే ప్రమాదం ఉందని టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే ఆదిపురుష్ టీంకి భారీ నష్టం తప్పదని తెలుస్తోంది. మూవీ టీం మాత్రం ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించడం వల్ల పాజిటివ్ టాక్ నడుస్తుందని తద్వారా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని భావిస్తున్నారని సమాచారం. ఆదిపురుష్‌కి ఈ ప్రదర్శన ప్లస్ అవుతుందో.. మైనస్ అవుతుందో వేచి చూడాలి.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!