Sai Dharam Tej: నేషనల్ క్రికెట్ టీంకి సెలక్ట్ అయ్యా.. ఆ ఛాన్స్ ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందంటే.. : సాయి ధరమ్

Sai Dharam Tej

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej).. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. స్టార్టింగ్ సాయి ధరమ్ కెరీర్ బాగున్నా కూడా మధ్యలో ఎందుకో గానీ వరుసగా ఫ్లాప్స్ రావడంతో వెనుకబడిపోయాడు. ఇక ఇప్పుడు స్క్రిప్ట్ విషయంలో సాయి ధరమ్(Sai Dharam Tej) అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నట్టు టాక్. అయితే సాయిధరమ్ ఫ్యాన్స్‌లో మంచి క్రేజే ఉంది. ఆయన కోసం ఫ్యాన్స్ వెళ్లినా కూడా రిసీవ్ చేసుకునే తీరుని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.

ఇక సాయిధరమ్(Sai Dharam Tej) నటించిన విరూపాక్ష(Virupaksha) సినిమా ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కోసమే ఈ మెగా హీరో ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బైక్ యాక్సిడెంట్ గురించి కూడా చెప్పాడు. తనను కాపాడిన వ్యక్తిని కలిసిన అయితే బయట ప్రచారమవుతున్నట్టుగా ఆర్థిక సాయం ఏమీ అందించలేదన్నాడు. కానీ అతనికి ఏ అవసరమొచ్చినా తనను కలవాలంటూ మొబైల్ నంబర్ ఇచ్చినట్టు వెల్లడించాడు.

Sai Dharam Tej

ఓ ఆసక్తికర విషయాన్ని కూడా సాయి ధరమ్(Sai Dharam Tej) ఇంటర్వ్యూలో వెల్లడించాడు. చిన్నప్పటి నుంచి తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. ఎన్నో మెడల్స్ కూడా సాధించానని తెలిపాడు. అంతే కాకుండా.. నేషనల్ క్రికెట్ టీంలో కూడా తాను సెలెక్ట్ అయ్యానని మెగా హీరో వెల్లడించాడు. సినిమాలపై ఉన్న ఇష్టంతోనే క్రికెట్‌ను వదులుకున్నానని తెలిపాడు. దీనికి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరేమో సాయిధరమ్(Sai Dharam Tej) మంచి టాలెంటెడ్ అని.. మరికొందరేమో కబుర్లు చెబుతున్నాడంటూ కొట్టిపారేస్తున్నారు.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!