Balakrishna: ఎన్టీఆర్ వారసుడైన బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదు?

Balakrishna: ఎన్టీఆర్ వారసుడైన బాలకృష్ణ ఫోటో ఎందుకు పెట్టలేదు? 

ఎన్టీఆర్(NTR) వందవ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఏమీ చేయలేదని.. సాధారణ అభిమానుల మాదిరిగానే చేశారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు భజన చేయించుకున్నారన్నారు. ఆ తర్వాత తమ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. శత దినోత్సవ వేడుకలు అంటే ఇవేనా? అని కొడాలి నాని ప్రశ్నించారు. అసలు ఎన్టీఆర్ వారసుడైన బాలకృష్ణ(Balakrishna) ఫోటో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. అలాగే లోకేష్ పాదయాత్రకు వెళ్లి చనిపోయిన తారకరత్న ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కేవలం చంద్రబాబును పొగిడించుకోవటానికే మహానాడు అని ఎద్దేవా చేశారు.

ఇక టీడీపీ మేనిఫెస్టోపై కొడాలి నాని(Kodali Nani) మాట్లాడుతూ.. అది భోగస్ అన్నారు. 2014, 2019 నాటి మీ మేనిఫెస్టోపై చర్చ పెడదామన్నారు. చంద్రబాబు(Chandra Babu Naidu) ఏం అమలు చేశాడో? ఏపీ సీఎం జగన్ ఏం చేశారో చర్చిద్దామని సవాల్ విసిరారు. ఆల్ ఫ్రీ బాబు అని వైఎస్ఆర్ గతంలో అనేవారని కొడాలి నాని అన్నారు. 2014లో చంద్రబాబు 650 వాగ్ధానాలు చేశారని లెక్కలతో సహా వివరించారు. వాటిని అమలు చేయిస్తామని మోదీ, పవన్ కల్యాణ్ అప్పట్లో చెప్పారన్నారు. మరి వాటిని ఎందుకు చేయలేదన్నారు. రైతు రుణమాఫీ అని చెప్పి కనీసం పది శాతం కూడా చేయలేదని కొడాలి నాని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ని చంద్రబాబు వేధిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.

Google News