KCR: హమ్మయ్యా.. ఎట్టకేలకు కేసీఆర్ మౌనం వీడారు.. మరి విమర్శలకు ఫుల్ స్టాప్ పడినట్టేనా?

KCR: హమ్మయ్యా.. ఎట్టకేలకు కేసీఆర్ మౌనం వీడారు.. మరి విమర్శలకు ఫుల్ స్టాప్ పడినట్టేనా?

తెలంగాణ సీఎం కేసీఆర్(Telangana CM KCR) ఎట్టకేలకు మౌనం వీడారు. మొన్నటి వరకూ ఎందుకోగానీ ఆయన ఏ విషయంపైనా స్పందించలేదు. కర్ణాటక ఎన్నికలు, రెండు వేల నోటు రద్దు, కొత్త పార్లమెంటు ఓపెనింగ్‌కు రాష్ట్రపతిని పిలవకపోవడం వంటి అంశాలపై ఆయన పెదవి విప్పలేదు. ఇది కాస్తా తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది.

జాతీయ స్థాయిలో రాణించాలనుకున్న కేసీఆర్.. అసలు ఎందుకు ఏ విషయంపై కూడా ఎందుకు స్పందించడం లేదనేది ఆసక్తికరంగానూ.. చర్చనీయాంశంగానూ మారింది. మొత్తానికి తాజాగా కేసీఆర్ మౌనం వీడారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అనంతరం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. కర్ణాటకలో బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టారని అయినా కూడా కేంద్రం మారకపోతే ఎలా? అని ప్రశ్నించారు. కేంద్రం అరాచకాలు, ఆగడాలు మితిమీరాయంటూ మండి పడ్డాయని.. మోదీ ప్రభుత్వం దేశాన్ని ఎటు తీసుకెళ్తోందంటూ ఫైర్ అయ్యారు. అలాగే గవర్నర్ వ్యవస్థపై కూడా తీవ్ర స్థాయిలో కేసీఆర్ స్పందించారు. కేవలం గవర్నర్ పదవి అలంకారప్రాయమని.. అలాంటి గవర్నర్ బడ్జెట్ పాస్ కానివ్వనంటే ఎలా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బడ్జెట్ ప్రవేశ పెట్టుకోవాల్సిన దౌర్భాగ్య దుస్థితి ఎక్కడైనా ఉంటుందా? అని మండిపడ్డారు. మొత్తానికి బీజేపీపై విమర్శలతో ఫుల్ స్టాప్ పడుతుందో లేదంటే ఇంకా కొనసాగుతాయో వేచి చూడాలి.