Chandra Babu Naidu: జగన్‌ను దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు..

Chandra Babu Naidu: జగన్‌ను దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు..

ఈసారి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి మహానాడును వేదికగా చేసుకోనున్నారు. జగన్‌ను ముఖ్యంగా దెబ్బ కొట్టాలంటే సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టాల్సిందే. ఈసారి వైసీపీ ప్రభుత్వానికి గడ్డు కాలం నడుస్తోంది. అయినా కూడా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిందా? దానికి కారణం.. సంక్షేమ పథకాలే అవుతాయి. విషయం తెలుసుకున్న చంద్రబాబు… ఇక దానిపైనే దెబ్బ కొట్టాలని తలచినట్టున్నారు. అందుకే మహానాడు వేదికగా సంక్షేమ పథకాలపై దెబ్బేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి ఎదురు గాలి వీస్తోంది. ఈ క్రమంలో ఆ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నమ్ముకుంది. కానీ టీడీపీ ప్రభుత్వం వాటిపై కూడా దెబ్బేసిందుకు సిద్ధమవుతోంది. ఈ సంక్షేమ పథకాలను టీడీపీ అధికారంలోకి వచ్చాక మరింత పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అవి మరింత ఎక్కువ మందికి లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. వీటికి తోడు చంద్రబాబు హయాంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఉండనే ఉన్నాయి. మొత్తం కలిపి మేనిఫెస్టోలో పొందుపరచనున్నట్టు సమాచారం. ఇది వర్కవుట్ అయితే మాత్రం టీడీపీదే అధికారమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Google News