Telangana BJP: తెలంగాణలో బీజేపీ పతనమైనట్టే.. లెక్కలతో సహా తేల్చి చెప్పిన ఆ పార్టీ నేత
తెలంగాణ(Telangana)లో బీఆర్ఎస్(BRS) విజయం ఖాయమని.. ఓట్ల శాతం తగ్గవచ్చేమో కానీ అధికార పీఠం మాత్రం వారిదేనని బీజేపీ(BJP) కీలక నేత ఒకరు తెలిపారు. బీజేపీ నేత ఒకరు ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్‌ను మార్చారు. పార్టీకి వ్యతిరేకంగా ఇప్పటి వరకూ మాట్లాడేవారు కాదు. కానీ ఇప్పుడు కట్టి తప్పి ఓ నేత లెక్కలతో సహా తెలంగాణ(Telangana), ఏపీలో బీజేపీ(BJP) పరిస్థితి ఏంటో చెప్పేశారు. తెలంగాణలో బీజేపీ స్థానం మూడోదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్(Congress Party) రెండో స్థానాన్ని ఆక్రమిస్తుందన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత తెలంగాణలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయన్నారు.
హిందూత్వ భావజాలంతో తెలంగాణలో నెగ్గుకు రావడం కష్టమని తేల్చి చెప్పారు. బీజేపీ(BJP) రెండో స్థానం ఆక్రమించాలంటే కాంగ్రెస్ నుంచి దాదాపు 40 మంది గట్టి నేతలు వస్తేనే సాధ్యమవుతుందన్నారు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత కాంగ్రెస్ మంచి స్ట్రాంగ్ అయ్యిందని ఇప్పుడు ఆ పార్టీని వీడేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. ఇకపోతే ఏపీ(Andhra Pradesh)లో వైసీపీ(YCP)కి బలం తగ్గిందన్నారు. సీఎం జగన్ (YS Jagan) ప్రభుత్వానికి ఎదురు గాలి వీస్తోందన్నారు. ఒకవేళ బీజేపీ కనుక తటస్థంగా ఉంటే మాత్రం టీడీపీ – జనసేన కూటమిదే అధికారమని సదరు బీజేపీ నేత ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా తేల్చి చెప్పారు.