Chandrababu Naidu: మహానాడు సాక్షిగా సమరశంఖం పూరించనున్న చంద్రబాబు.. కీలక నిర్ణయాలు

Chandrababu Naidu: మహానాడు సాక్షిగా సమరశంఖం పూరించనున్న చంద్రబాబు.. కీలక నిర్ణయాలు

ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పార్టీలన్నీ అధికారం దక్కించుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. ఏపీలో అయితే అటు వైసీపీ.. ఇటు టీడీపీల నడుమ హోరాహోరీ నడుస్తోంది. ఈసారి ఎన్నికలు చాలా టఫ్. దీంతో అక్కడ బీభత్సమైన ఉత్కంఠ నెలకొంది. ఇక ఈసారి అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు చూస్తున్నారు. సమరశంఖాన్ని పూరించేందుకు మహానాడును వేదికగా తీసుకున్నట్టు తెలుస్తోంది.

చంద్రబాబు గతంలో మాదిరిగా ఇప్పుడు వడివడిగా అడుగులు వేస్తున్నారు. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి మేనిఫెస్టో రూపకల్పనకు అంకురార్పణ చేశారు.

ఇటు మహానాడు సాక్షిగా వీలైనంత మందిని పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరం వేదికగా టీడీపీ మహానాడు.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో కొన్ని కీలక నిర్ణయాలను చంద్రబాబు ప్రకటించనున్నట్టు సమాచారం.

మహానాడు తర్వాత కేడర్‌ను ఫుల్ జోష్‌తో ఎన్నికల్లో తిప్పేలా వ్యూహ రచన చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి ఎన్నికల ప్రచారంలోకి నందమూరి కుటుంబాన్ని దింపబోతున్నట్టు టాక్ నడుస్తోంది. యువతకే ఎక్కువ టికెట్స్ కేటాయిస్తారని సమాచారం. ఈ విషయాన్ని కూడా మహానాడు వేదికపై ప్రకటించనున్నారని సమాచారం.

Google News