Perni Nani: సీఎం జగన్‌కు పేర్ని నాని రూపంలో కొత్త తలనొప్పి..

Perni Nani: సీఎం జగన్‌కు పేర్ని నాని రూపంలో కొత్త తలనొప్పి..

ఏపీ సీఎం జగన్‌(YS Jagan)కు ఉన్న తలనొప్పులు చాలవన్నట్టుగా మరో కొత్త తలనొప్పి యాడ్ అయ్యింది. ఇప్పటి వరకూ తన కొడుకుకు టికెట్ ఇవ్వాలి.. తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతానంటూ పలు మార్లు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని(Perni Nani) చెప్పారు. కానీ ఏదో అలా చెబుతున్నారులే అనుకుంటే.. బందరు సభా వేదికగా జన సందోహం నడుమ.. సీఎం జగన్ ముందే తన రిటైర్‌మెంట్ వ్యాఖ్యలు చేసి షాక్ ఇచ్చారు.

మరోసారి జగన్‌తో తాను సమావేశం అవుతానో లేదో తనకే తెలియదని బందరు సభలో పేర్కొన్నారు. రిటైర్ అవుతున్నానని కూడా తేల్చి చెప్పారు. అంతే ఒక్కసారిగా ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి.

కొడుకు టికెట్ ఇవ్వకుంటే పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమన్నట్టుగా పేర్ని నాని(Perni Nani) తెలిపారు. అయితే ఇప్పటికే కొందరు నేతలు సైతం తమ వారసుల ప్రపోజల్‌ను జగన్ ముందు పెడుతున్నారు. కానీ జగన్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇస్తానని తేల్చి చెప్పారు.

ఈ తరుణంలో పేర్ని నాని(Perni Nani) కొడుక్కి టికెట్ ఇస్తే మిగిలిన నేతలు సైతం జగన్‌పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. పైగా అక్కడ పేర్ని నాని నిలబడితేనే గెలిచే అవకాశాలు ఎక్కువ. లేదంటే టీడీపీ చేతిలో ఓటమి ఖాయమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో జగన్ రిస్క్ తీసుకుంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Google News