జగన్ నిర్ణయమే కథను అవినాష్ అరెస్ట్ వరకూ నడిపించిందా? ఏపీలో ఆసక్తికర చర్చ

జగన్ నిర్ణయమే కథను అవినాష్ అరెస్ట్ వరకూ నడిపించిందా? ఏపీలో ఆసక్తికర చర్చ

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా నడుస్తున్న ఇష్యూ వైఎస్ వివేకా హత్య కేసు. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారా? లేదా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం. ఆయన అరెస్ట్ భయంతో ఏవేవో కారణాలు చెప్పి విచారణకు గైర్హాజరవడం ఇది వరుసగా మూడోసారి. ఈ సారి తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ అవినాష్ ఆసుపత్రి నుంచి బయటకు కూడా రావట్లేదు. చుట్టూ మందీ మార్బలంతో సీబీఐని ఆసుపత్రి పరిసరాలకు కూడా రానివ్వడం లేదు. సీబీఐ కూడా ఇదో అరెస్ట్.. అదిగో అరెస్ట్ అంటూ తాత్సారం చేస్తోంది. ఈ దాగుడు మూతలు ఇంకెంత కాలమనేది సామాన్య జనానికి అర్థం కాని పరిస్థితి. 

తాజాగా మరో ఆసక్తికర చర్చ మొదలైంది. ఒకప్పుడు అంటే టీడీపీ చంద్రబాబు అధికారంలో ఉండగా.. మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు బృందాలను దుర్వినియోగం చేస్తోందంటూ రాష్ట్రంలో సీబీఐపై నిషేధం విధించారు. అయితే వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుపై కోపంతోనో.. టీడీపీ వారిని ఇబ్బందులు పెట్టాలనో కానీ సీబీఐపై నిషేధం ఎత్తేశారు. దీంతో ఒకవేళ అవినాష్ అరెస్ట్ అయితే మాత్రం ఆ పాపం సీఎం వైఎస్ జగన్‌దేని.. ఆయన చేసిన తప్పు వల్లే ఈ పరిణామాలన్నీ అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు కేసీఆర్ సైతం సీబీఐపై నిషేధం విధించారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Google News