Pawan Kalyan: సీఎం జగన్‌కు వ్యతిరేకంగా పవన్ క్లాస్ వార్..!

Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan).. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా క్లాస్ వార్ స్టార్ట్ చేశారు. పెద్ద ఎత్తున జగన్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), పవన్‌(Pawan Kalyan)లపై నిజాంపట్నంలో మత్స్యకార నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మరి దీనికి పవన్ ఊరుకుంటారా? ట్విటర్ వేదికగా కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చారు. ‘పాపం పసివాడు’ అనే పోస్టర్‌తో జగన్‌ను పవన్ ఒక ఆట ఆడుకున్నారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో.. సోషల్ మీడియాలో పవన్ పాపం పసివాడు ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది.

జగన్‌ ఏమీ కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్‌ తరిమెల నాగిరెడ్డి కాదన్నారు. జగన్‌(YS Jagan)తో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తే బాగుంటుందని సలహా కూడా ఇచ్చేశారు. అయితే పవన్(Pawan Kalyan) పోస్ట్ చేసిన పోస్టర్‌లో చిన్న పిల్లవాడు.. అతని చేతిలో సూట్ కేసు ఉంది. కానీ పాపం పసివాడు కోసం వినియోగించే పోస్టర్‌లో జగన్ చేతిలో సూట్ కేసుల కంపెనీలు ఉండాలని సూచించారు. జగన్ క్లాస్ వార్ అని ఓ సందర్భంలో చెప్పిన మాటపై కూడా విమర్శలు గుప్పించారు. అది క్లాస్ వార్ కాదని క్యాష్ వార్ అని పవన్ కల్యాణ్ అన్నారు. తన అన్న నాగబాబుతో కలిసి కథాకళి పేరుతో ఒక కామెడీ చర్చను నిర్వహించి ఆ వీడియోను సైతం ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

Google News