Revanth Reddy: ఓ మెట్టు దిగిన రేవంత్.. వారికి ఆహ్వానం.. కాంగ్రెస్ విజయం కోసం అదిరిపోయే స్కెచ్..!

Revanth Reddy: ఓ మెట్టు దిగిన రేవంత్.. వారికి ఆహ్వానం.. కాంగ్రెస్ విజయం కోసం అదిరిపోయే స్కెచ్..!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ మెట్టు దిగారు. ఇప్పటికే తనను విభేదించిన వారిని సైతం కలుపుకు పోయే యత్నం చేస్తున్న రేవంత్ ఇప్పుడు మరో మెట్టు దిగి.. తనవారు, పరాయి వారన్న భేదం లేకుండా అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. కర్ణాటక ఫలితాలను తెలంగాణలో రిపీట్ చేయాలన్న లక్ష్యంతో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని శత విధాలా యత్నిస్తున్నారు.

కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. ఫుల్ జోష్‌తో పని చేస్తున్నారు. ఈ జోష్‌కి తోడు పార్టీ నుంచి వెళ్లిపోయిన వారితో పాటు బీఆర్ఎస్, బీజేపీలను వీడిన వారిని కాంగ్రెస్‌లోకి తీసుకు వచ్చేందుకు రేవంత్ యత్నిస్తున్నారు.

ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులకు ఆహ్వానం పలికారు. తనతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్న వారి కోసం మరో ప్రత్యేక సూచన కూడా చేశారు. తాను ఒక పార్టీ కార్యకర్తను మాత్రమేనని పార్టీలో మల్లిఖార్జున్ ఖర్గే, సోనియా గాంధీలు మాత్రమే పెద్ద నాయకులని.. పార్టీలో చేరాలని అనుకుంటే.. వాళ్లతో నేరుగా మాట్లాడుకోవచ్చన్నారు.

మొత్తానికి కీలక నేతలకైతే ఆహ్వానం పలికేశారు. వారు రేవంత్ అభ్యర్థనను మన్నించి వస్తే మాత్రం పార్టీ భవిష్యతే మారిపోవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Google News