Rajagopal Reddy: కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్.. తిరిగి కాంగ్రెస్ గూటికి రాజగోపాల్ రెడ్డి?
మొత్తానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీజేపీ(BJP)ని చిక్కుల్లో పడేశాయి. ముఖ్యంగా దక్షిణాదిలో ఆ పార్టీని చావు దెబ్బ కొట్టాయి. ఇక ఇప్పుడు తెలంగాణలో తమ పార్టీలను వీడి బీజేపీలో చేరాలనుకుంటున్న నేతలంతా వెనక్కి తగ్గారు. ఇక పార్టీలో ఇప్పటికే చేరిన వారు తిరిగి సొంత పార్టీకి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే ఆయన గత మూడు రోజులుగా తన అనుచరులతో సమావేశమై చర్చలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ విషయం ఆ పార్టీ నేతలకు సైతం స్పష్టంగానే తెలుస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ(BJP) కీలక నేతలంతా సైలెంట్ అయ్యారని టాక్. ఇక రాష్ట్ర నాయకత్వ బాధ్యతల నుంచి బండి సంజయ్‌ను తప్పించి ఈటల రాజేందర్(Etela Rajendar)కు అప్పగించినా కూడా పరిస్థితుల్లో పెద్దగా ఏమీ మార్పు ఉండబోదని రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) తన అనుచరుల వద్ద వాపోయారట.
అసలు మొత్తగా దేశంలోనే మోదీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పారట. ఈ క్రమంలోనే సొంత గూటికి చేరాలనుకుంటున్న అనుచరుల వద్ద రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) చెప్పారట. తనపై రూ.18 వేల కోట్ల టెండర్‌కి సంబంధించిన ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) క్షమాపణలు చెబితే తాను తిరిగి కాంగ్రెస్‌లో చేరుతానంటూ కండీషన్ పెడుతున్నారట.