Karnataka CM: కర్ణాటక సీఎం కుర్చీ ఎవరిది? తెలంగాణలో బీఆర్ఎస్‌కు అదిరిపోయే అస్త్రం దొరికేసినట్టేనా?

Karnataka CM: కర్ణాటక సీఎం కుర్చీ ఎవరిది? తెలంగాణలో బీఆర్ఎస్‌కు అదిరిపోయే అస్త్రం దొరికేసినట్టేనా?

తెలంగాణలో ఈసారి అధికారం బీఆర్ఎస్(BRS) పార్టీదే అనడంలో మొన్నటి వరకూ ఎలాంటి సందేహమూ లేదు. కానీ కర్ణాటక(Karnataka) ఫలితం తర్వాత మాత్రం కాస్త నీలిమేఘాలు కమ్ముకున్నాయేమో అనిపించింది కానీ ఇప్పుడు సీఎం సీటు ఎవరిదనే వ్యవహారం మాత్రం తిరిగి బీఆర్ఎస్‌(BRS)కు కొండంత బలాన్నిచ్చింది. పొరపాటున తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందో సీఎం సీటు కోసం దారుణంగా ఆ పార్టీ నేతలు కొట్టుకోవడం ఖాయమనే విషయాన్ని మంచి అస్త్రంగా మలుచుకుని బీఆర్ఎస్(BRS) సంధించే అవకాశం ఉంది.

కర్ణాటక(Karnataka) ఫలితం మాటేమో కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చచ్చేంత చావొచ్చింది. రేపొద్దున పొరపాటున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పరిస్థితేంటి..? ఇద్దరు పోటీ పడితేనే సీఎం సీటు వ్యవహారం మూడు రోజులైనా తేలట్లేదు. ఇక తెలంగాణలో పది మంది పోటీ పడతారనడంలో సందేహం లేదు.

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, వీహెచ్.. జానారెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ అందరూ లీడర్లే.. సీఎం సీటు కావాలని కోరుకున్నవారే. మరి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే న్యాయంగా వెళితే రేవంత్‌కే అప్పగించాలి కానీ సీనియర్స్ ఊరుకుంటారా? పెద్ద రచ్చై పోదు. ఇది బీఆర్ఎస్‌(BRS)కు బాగా బలాన్నిస్తున్న అంశం. ఇక ఆ పార్టీ దూసుకెళ్లడం ఖాయం.

Google News