Telangana BJP: కర్ణాటక ఫలితం దెబ్బ.. తెలంగాణలో బీజేపీ అబ్బా..

Telangana BJP: కర్ణాటక ఫలితం దెబ్బ.. తెలంగాణలో బీజేపీ అబ్బా..

దక్షిణాదిలో బీజేపీలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో ఇప్పుడు పార్టీకి దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. కర్ణాటకలో దెబ్బకు తెలంగాణ(Telangana)లో బీజేపీ నేతలు అబ్బా అంటున్నారు.

కర్ణాటక(Karnataka) ఫలితంతో రెట్టించిన ఉత్సాహంతో పని చేద్దామనుకున్న తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కసారిగా డల్ అయిపోయారు. అటు నేతలు, ఇటు క్యాడర్ తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు. తెలంగాణలో బీజేపీకి అన్ని విధాలుగా నష్టమే చేకూరింది. దక్షిణాదిలో బీజేపీ(BJP)కి అయితే డోర్స్ క్లోజ్ అయ్యాయి. అంతేకాదు బీజేపీకి తెలంగాణలో కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి.

కర్ణాటక ఫలితంపై తెలంగాణ బీజేపీ(Telangana BJP) నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఇప్పటి వరకూ కర్ణాటక ఫలితం చూసి బీజేపీ(BJP)లో చేరికపై నిర్ణయం తీసుకోవాలనుకున్న నేతలంతా వెనుకడుగు వేస్తారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishnarao) బీజేపీలో చేరాలనుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు వారి చేరిక కూడా కష్టమే.

అంతేకాకుండా కర్ణాటకలో ఫలితం అనుకూలంగా ఉండి ఉంటే తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పని చేసి ఉండేవారు కానీ ఇప్పుడు నిరాశ నిస్పృహల్లో చేరుకున్నారు. ఇక ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Google News