Telangana BJP: కర్ణాటక ఫలితాల తర్వాత టీబీజేపీలో మార్పు.. పూటకో స్టేట్‌మెంట్ ఇస్తున్న నేతలు..!

Telangana BJP: కర్ణాటక ఫలితాల తర్వాత టీబీజేపీలో మార్పు.. పూటకో స్టేట్‌మెంట్ ఇస్తున్న నేతలు..!

కర్ణాటక ఫలితాలు తెలంగాణ బీజేపీ(Telangana BJP)ని తీవ్రాతి తీవ్రంగా దెబ్బ కొట్టాయి. దెబ్బకు బీజేపీ తెలంగాణలో మూడో స్థానానికి పడిపోయింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. కాంగ్రెస్‌లో చేరేందుకు ఇద్దరు మాజీ ఎంపీలు యత్నిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికైతే బీజేపీ కోలుకునే పరిస్థితి అయితే లేదు.

ఈ నేపథ్యంలో నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మంతనాలు సైతం సాగిస్తున్నారట. తమకు లోక్‌సభ టికెట్లు ఇస్తామని హామీ ఇస్తే కాంగ్రెస్‌లో చేరుతామని ప్రతిపాదనలు పంపిస్తున్నారట. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ వ్యవహారంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది.

Advertisement

ఇక బీజేపీ కీలక నేతలు సైతం కర్ణాటక ఫలితాల తర్వాత పూటకో స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో గందరగోళం చోటు చేసుకుంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి వచ్చేసి.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని తేల్చి పారరేశారు.

మళ్లీ తెలంగాణ(Telangana)లో కేసీఆర్‌(KCR)దే అధికారమని.. ఇక బీజేపీ(BJP) మూడో స్థానానికి పడిపోయిందని ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు అన్నారు. ఇక సోనియా, రాహుల్‌పై తనకు అభిమానం ఉందని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తమ పార్టీలో చేరికలు కష్టమని.. ఇక బీజేపీ పుంజుకోవడం కష్టమని ఈటల రాజేందర్(Etela Rajendar) పేర్కొన్నారు. సీనియర్ నేతలే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే.. ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు.