మెగా ఫ్యామిలీ కోరిక తీరలేదా? సెంటిమెంట్ వెంటాడిందా?

మెగా ఫ్యామిలీ కోరిక తీరలేదా? సెంటిమెంట్ వెంటాడిందా?

ఒక వారసుడు కావాలని ఎవరికి ఉండదు? అందునా తండ్రి, తాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకునే అబ్బాయి కోసం కుటుంబమంతా ఎదురు చూడటం కామన్. అందునా అప్పటి వరకూ ఆ కుటుంబంలో అమ్మాయిలు మాత్రమే పుట్టి ఉంటే ఒక్క అబ్బాయి కావాలనుకోవడం సర్వసాధారణం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇంట్లోనూ అదే జరిగిందని టాక్. మెగా ఫ్యామిలీ అంతా చెర్రీకి బాబు పుడితే బాగుండు అని ఎంతగానో ఎదురు చూశారట. 

పాప అంటే ఇష్టం లేక కాదు కానీ.. మెగాస్టార్ పిల్లల్లో పెద్ద కుమార్తె సుస్మితకు ఇద్దరు అమ్మాయిలు. రెండో కుమార్తె శ్రీజ(Sreeja)కు కూడా ఇద్దరు అమ్మాయిలు కాబట్టి చిరు ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు తాత చిరంజీవి, తండ్రి రామ్ చరణ్(Ram Charan) వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేలా బాబు పుడితే బాగుండని ఎదురు చూశారట. కానీ మెగాస్టార్ కుటుంబాన్ని సెంటిమెంట్ వెంటాడింది. చెర్రీకి కూడా పాపే పుట్టింది.

చిరంజీవి(Chiranjeevi) అయితే చాలా ఆనందంగా ఫీలయ్యారు. ఆ విషయం ఆయన ట్వీట్‌లోనే తెలుస్తోంది. అయితే ఆ మధ్య ఒకసారి సుస్మిత ఓ సందర్భంలో మాట్లాడుతూ.. రామ్ చరణ్(Ram Charan) కి అబ్బాయి పుట్టినా, అమ్మాయి పుట్టినా ఓకే అని తెలిపారు. అయితే అబ్బాయి పుడితే బాగుండు అని పేర్కొన్నారు. దీనికి కారణం కూడా సుస్మిత చెప్పారు. తమ ఫ్యామిలీలో తామిద్దరు అక్కాచెల్లెళ్లకూ అమ్మాయిలే పుట్టారని, అబ్బాయి ఒక్కడు కూడా లేడని.. అందుకే అబ్బాయిని కోరుకుంటున్నామని తెలిపారు.

ఇవీ చదవండి:

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. సంబరాల్లో మెగా ఫ్యామిలీ

ఆదిపురుష్ వసూళ్లన్నీ హమ్మక్.. తప్పుతప్పుగా చెబుతున్నారట..

చిరు, నేను ఒకే రూమ్‌లో కలిసుండే వాళ్లం.. ఏ అవసరమొచ్చినా.. : సుధాకర్

రాకేష్ మాస్టర్ దుస్థితి గురించి తెలిస్తే కన్నీళ్లాగవు..!

Google News