Rakesh Master: రాకేష్ మాస్టర్ దుస్థితి గురించి తెలిస్తే కన్నీళ్లాగవు..!

రాకేష్ మాస్టర్

టాలీవుడ్ ఇండస్ట్రీకి స్టార్ కొరియోగ్రాఫర్స్‌ని అందించిన రాకేష్ మాస్టర్(Rakesh Master) ఇక లేరన్న వార్త ఒక ఎత్తైతే.. ఆయన మరణానంతరం దుస్థితి చూసి చాలా మంది చలించి పోతున్నారు.

ఇండస్ట్రీలో ఆ తరువాత సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా రాకేష్ మాస్టర్(Rakesh Master) ఒక రేంజ్‌లో పాపులారిటీని సంపాదించారు. ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసి మరింత పాపులర్ అయ్యారు.

రాకేష్ మాస్టర్ శిష్యులైన శేఖర్ మాస్టర్(Sekhar Master), జానీ మాస్టర్(Johnny Master) ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ డిమాండ్ ఉన్న కొరియోగ్రాఫర్స్‌లో ఒకరిగా కొనసాగుతున్నారు. స్టార్ హీరోలందరి ఫస్ట్ ఛాయిస్ ఈ ఇద్దరు కొరియో గ్రాఫర్సే కావడం విశేషం. వీరిద్దరూ ఈ స్థాయికి రావడానికి మెయిన్ కారణం రాకేష్ మాస్టర్(Rakesh Master) అనడంలో సందేహం లేదు. అంతా బాగానే ఉంది కానీ రాకేష్ మాస్టర్‌కి చివరకు తనకంటూ ఓ కుటుంబం లేకపోవడం గమనార్హం.

ఆయన వ్యసనాలకు బానిసై కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టుకోవడం వల్లనో.. మరొకటో కానీ ఆయనకి ఆయన కుటుంబం దూరమై పోయింది. ఆయన జీవితంలోకి తరువాత వచ్చిన వారు కూడా ఎందుకో ఆయన విడిచి వెళ్లేందుకు పెద్దగా సమయం తీసుకోలేదు. ప్రస్తుతం ఆయన మరణించారంటే కన్నీరు కార్చేందుకు కూడా కుటుంబం లేదు. కనీసం కడసారి చూసేందుకు సైతం కుటుంబం నుంచి ఏ ఒక్కరూ రాలేదని తెలుస్తోంది. తలకొరివి పెట్టేందుకు సైతం ఎవరూ లేకపోవడంతో శిష్యులలో ఒకరు ఆయనకు తలకొరివి పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.

Google News