Samantha: పెళ్లైన హీరోతో సమంత ప్రేమాయణం..?

Samantha: పెళ్లైన హీరోతో సమంత ప్రేమాయణం..?

స్టార్ హీరోలు, హీరోయిన్లపై పుకార్లు సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. కొన్ని నిజమవుతుంటాయి. కొన్ని కేవలం పుకార్లుగానే మిగిలిపోతాయి. కొంతకాలంగా అక్కినేని హీరో నాగ చైతన్య(Naga Chaitanya) విషయంలో తెగ పుకార్లు వస్తున్నాయి. ఆయన శోభిత దూళిపాళ్ల(Shobitha Dhulipala)తో డేటింగ్‌లో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. వీరిద్దరూ జంటగా ఎన్నో సార్లు కెమెరాలకు చిక్కారు. దీంతో ఇవి కేవలం పుకార్లు కాదని ఎంతో కొంత నిజముందని టాక్.

ఇక తాజాగా చైతు మాజీ భార్య సమంత(Samantha) గురించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈమె పెళ్లైన హీరోతో ప్రేమలో పడిందట. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో సమంత పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోందంటూ బాలీవుడ్ మీడియా సంస్థలు కథనాలను వెలువరిస్తున్నాయి. సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో సమంత, వరుణ్ ధావన్(Varun Dhawan) కలిసి నటిస్తున్నారు. ఈ సిరీస్ షూటింగ్‌లో భాగంగా తరచూ కలుస్తున్న వీరిద్దరూ క్రమక్రమంగా దగ్గరయ్యారట.

Samahtha, Varun Dhawan

అయితే ఇటీవల వరుణ్ ధావన్(Varun Dhawan) తన భార్య నటాషా దలాల్‌తో విడిపోతున్నట్టు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి సామ్(Samantha), వరుణ్‌(Varun Dhawan)లు ప్రేమలో ఉన్నారనే టాక్ మరింత పెరిగింది.

2021లో నటాషాను వరుణ్ ధావన్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. చాలా కాలం పాటు ప్రేమించుకుని మరీ వివాహం చేసుకున్న ఈ జంట విడిపోవడం కేవలం పుకారేనని కూడా అంటున్నారు. మొత్తానికి సామ్, వరుణ్ ధావన్‌లు మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారారు.

Google News