Adipurush: ఆదిపురుష్ వసూళ్లన్నీ హమ్మక్.. తప్పుతప్పుగా చెబుతున్నారట..

Adipurush: ఆదిపురుష్ వసూళ్లన్నీ హమ్మక్.. తప్పుతప్పుగా చెబుతున్నారట..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన ‘ఆదిపురుష్’(Adipurush) చిత్రం గత శుక్రవారం విడుదలై కావల్సినంత నెగిటివ్ టాక్‌ను మూటగట్టుకున్న విషయం తెలిసిందే. రామాయణంలోకి ఘట్టాలను అపహాస్యం చేయడంతో పాటు ఏదో యానిమేషన్ చిత్రాన్ని చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగజేయడంతో బీభత్సమైన నెగిటివ్ టాక్ వచ్చింది. పైగా రాముడి పాత్ర కన్నా మిగిలిన పాత్రలకు హైప్ ఎక్కువగా ఇవ్వడం కూడా ఈ సినిమాకు మైనస్ అని ప్రేక్షకులు చెబుతున్నారు.

అసలే రామాయణం అంటే హిందువులకు చాలా సెంటిమెంట్. అటువంటి రామాయణాన్ని చెత్తగా చూపించారంటూ ప్రేక్షకులు మండిపడుతున్నారు. మొత్తానికి రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఆదిపురుష్ చిత్రం ట్రోలర్స్‌కి బీభత్సమైన పని చెప్పింది. రామాయణాన్ని ఫేక్ ఫేక్‌గా రూపొందించారంటూ దర్శకుడు ఓం రౌత్‌(Om Raut)ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. సినిమానే కాదు.. సినిమా వసూళ్లను సైతం చిత్ర యూనిట్ తప్పు తప్పుగా చెబుతోందట.

adipurush

అసలు వసూళ్లను దాచి నిర్మాతలు ఫేక్ వసూళ్లను చెబుతున్నారని ట్రేడ్ పండితులు ఆరోపిస్తున్నారు. ఈ సినిమా రెండో రోజు వసూళ్లు వచ్చేసి రూ.67 కోట్ల గ్రాస్ మాత్రమే రాగా.. నిర్మాతలు మాత్రం వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చినట్టు చూపించారు. అలాగే మూడో రోజు.. వంద కోట్ల వసూళ్లు వచ్చాయని.. మొత్తంగా ఈ మూడు రోజుల్లో రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని తెలిపారు. కానీ మూడు రోజులకు కలిపి రూ.249 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చిందని నిర్మాతలు మాత్రం కోట్లలో తేడా చూపిస్తున్నారని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

చిరు, నేను ఒకే రూమ్‌లో కలిసుండే వాళ్లం.. ఏ అవసరమొచ్చినా.. : సుధాకర్

రాకేష్ మాస్టర్ దుస్థితి గురించి తెలిస్తే కన్నీళ్లాగవు..!

ఆదిపురుష్‌ను అల్లాడిస్తున్న ట్రోల్స్.. రాముడిగా ప్రభాస్ అస్సలు బాగోలేడట..

Google News