Rakesh Master Son: నా తండ్రి చావుకు కారణం వాళ్లే.. ఇప్పటికైనా ఆపేయండి: రాకేష్ మాస్టర్ కుమారుడు

Rakesh Master Son: నా తండ్రి చావుకు కారణం వాళ్లే.. ఇప్పటికైనా ఆపేయండి: రాకేష్ మాస్టర్ కుమారుడు

కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్(Rakesh Master) హఠాన్మరణం ఆయన అభిమానులను, శిష్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎన్నోసార్లు ఆయన తీవ్ర అనారోగ్యాల నుంచి బయటపడ్డారు. ఒకసారి అయితే తాను చనిపోతానని ఏకంగా తన సమాధిని తానే తవ్వించుకున్నారు. అలాంటి వ్యక్తి షూటింగ్ కోసం వైజాగ్ వెళ్లి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత అస్వస్థత కు గురయ్యారు. చివరకు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఆయన బతికి ఉన్నంత కాలం యూట్యూబ్ చానెళ్లకు అవసరమైనంత స్టఫ్ ఇచ్చారు. కాంట్రవర్సీ కామెంట్లు ఆయన చేత చేయించి కావల్సినంత లబ్ధి పొందారు. ఈ విషయంపై తాజాగా రాకేష్ మాస్టర్ కుమారుడు చరణ్ స్పందించాడు. స్వలాభం కోసం పాకులాడుతూ తన తండ్రిని చెడుగా చిత్రించిన వైనాన్ని తప్పు పడుతూ చరణ్ చరణ్ యూట్యూబ్ చానెళ్లపై విరుచుకుపడ్డాడు. తన తండ్రి మరణానికి యూట్యూబ్ ఛానళ్లే కారణమని మండిపడ్డాడు.

అసలు చరణ్(Rakesh Master Son Charan) ఏమన్నాడంటే.. తన తండ్రి చావుకు ప్రధాన కారణం యూట్యూబ్ ఛానళ్లేనని.. అవి తమ రేటింగ్స్ కోసం తన తండ్రిని వినియోగించుకున్నాయన్నారు. తన తండ్రిని వీరంతా చెడుగా చిత్రీకరించారన్నాడు. ఇప్పటికీ అలాంటి వీడియోలను ప్రసారం చేస్తున్నాయని కాబట్టి వాటిని ఇక ఆపేయాలని చరణ్ తెలిపాడు. సోషల్ మీడియాలో సైతం తమ కుటుంబ సమస్యలను ప్రస్తావించడం ఆపాలని.. తమకు జరిగిన నష్టం చాలంటూ చరణ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇవీ చదవండి:

మహేష్ వేధింపుల వల్లే పూజా హెగ్డే ‘గుంటూరు కారం’ నుంచి తప్పుకుందట.. దీనిలో నిజమెంత?

వెబ్‌సిరీస్‌లో ప్రియుడితో కలిసి ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన తమన్నా..

డ్రైవర్‌తో కీర్తి సురేష్ లవ్.. ఫ్యాన్స్ ఫైర్..!

Google News