Tamannah: వెబ్‌సిరీస్‌లో ప్రియుడితో కలిసి ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన తమన్నా..

Tamannah: వెబ్‌సిరీస్‌లో ప్రియుడితో కలిసి ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన తమన్నా..

మిల్కీ బ్యూటీ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే తమన్నా(Tamannah) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2005లో శ్రీ సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయమైంది. అప్పటి నుంచి మొన్నటి వరకూ ఎలాంటి రూమర్స్ లేకుండా గడిపింది. కానీ ఇటీవలి కాలంలో అమ్మడిపై రూమర్స్ బీభత్సంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు అమ్మడు అందాల ఆరబోత ఒకటి. హద్దులనేవే లేకుండా దూసుకెళుతోంది. దీంతో రూమర్స్ మరింత పెరిగాయి.

ఏనాడు మనం తమన్నాను బోల్డ్ సన్నివేశాల్లో చూసింది లేదు. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్కిన్ షోలు, బోల్డ్ సన్నివేశాల్లో ఎడాపెడా నటించేస్తోంది. దీనికి తోడు అమ్మడు పీకల్లోతు ప్రేమలో ఉందట. ఎంసీఏ మూవీ విలన్ విజయ్ వర్మతో కనిపిస్తే తొలుత అంతా ఏదో క్యాజువల్ మీట్ అయ్యుంటుందిలే అనుకున్నారు. తరచూ కనిపిస్తుంటడంతో అనుమానాలు పెరిగిపోయాయి. ఇక ఏమనుకుందో ఏమో కానీ తమన్నా(Tamannah)యే కుండబద్దలు కొట్టేసింది.

Tamannah: వెబ్‌సిరీస్‌లో ప్రియుడితో కలిసి ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన తమన్నా..

విజయ్ వర్మ(Vijay Varma)తో లివింగ్ రిలేషన్‌లో ఉన్నానని తమన్నా వెల్లడించింది. తాజాగా వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న జి కర్దా(Jee Karda) వెబ్ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఆ ట్రైలర్ చూస్తే చాలు… వాళ్లు ఎంత దగ్గరయ్యారనేది అర్థమవుతుంది. అమ్మడు స్కిన్ షో చేయడమే కాదు. హద్దులు దాటేసి మరీ బూతు సన్నివేశాలు, బూతు మాటలతో రెచ్చిపోయింది. అది చూసిన వారెవరికైనా మనం చూస్తున్నది తమన్నా(Tamannah)నేనా అని అనిపించక మానదు.

Google News